Agni-5 Success: భారత్ అగ్ని 5 మిస్సైల్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. మిషన్ దివ్యాస్త్రగా పిలిచే అగ్ని5 ప్రయోగం జరిగింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ టెక్నాలజీతో అగ్ని5 మిస్సైల్ ను DRDO సైంటిస్టులు తయారు చేశారు. ఈ సందర్భంగా DRDO సైంటిస్టులకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.
CAA Notification: ఇవాళ్టి నుంచి సీఏఏ అమలు.. గెజిట్ రిలీజ్ చేసిన కేంద్రం !
అగ్ని5 MVRI టెక్నాలజీని కలిగి ఉంది. అంటే ఒక్కటే మిస్సైల్ ఉపయోగించి మల్టిపుల్ వార్ హెడ్స్‌ని, వివిధ ప్రాంతాల్లో మోహరించడానికి అవకాశం ఉంటుంది. అగ్ని5 మిస్సైల్ కి 2 టన్నుల వార్ హెడ్స్ మోసుకెళ్ళే సామర్థ్యం ఉంటుంది. MVRI టెక్నాలజీ ఇప్పటి దాకా అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇండియా కూడా ఆ దేశాలతో పాటు చేరింది. 1990 నుంచి DRDO ఈ అగ్ని మిస్సైల్స్‌ను తయారు చేస్తోంది. అగ్ని 5 మిస్సైల్.. 5 వేల కిలోమీటర్ల దాకా లక్ష్యాలను ఛేదించనుంది. అంటే చైనా రాజధాని బీజింగ్ తో పాటు ఆ దేశంలోని ఉత్తర భాగం, మొత్తం ఆసియా దేశాలు, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా టార్గెట్ రేంజ్ లోకి వస్తాయి. అయితే చైనా దగ్గర డాంగ్ ఫెంగ్ 41 మిస్సైల్స్ ఉన్నాయి. వీటి పరిధి 12 వేల నుంచి 15 వేల కిలోమీటర్ల దాకా ఉంటుంది. చైనాను దృష్టిలో పెట్టుకొని ఇండియా అగ్ని 5ను సొంతంగా డెవలప్ చేసింది. అగ్ని5 ప్రయోగాన్ని చైనా రీసెర్చ్ నౌక దగ్గరుండి పరిశీలించింది.
చైనాకు చెందిన రీసెర్చ్‌షిప్ విశాఖ పట్నానికి 260 నాటికల్ మైళ్ళు (దాదాపు 480 కిమీ) దూరంలో లంగర్ వేసింది. మార్చి 11 నుంచి 16 లోపు బంగాళాఖాతంలో కొన్ని ఏరియాలను భారత్.. నోటమ్ అని పిలిచే నో ఫ్లై జోన్ ఏరియాలుగా ప్రకటించింది. అంటే మిస్సైల్ టెస్టు ఉంటుందని ముందే సంకేతాలు ఇచ్చింది. దాంతో చైనా ఈ అగ్ని ప్రయోగాన్ని కనిపెట్టేందుకు జియాంగ్ యాంగ్ హాంగ్ అనే 4 వేల 8 టన్నుల బరువైన రీసెర్చ్ వెస్సెల్ ను మలక్కా జలసంధిలోకి తీసుకొచ్చింది. విశాఖకు దగ్గర్లోనే ఉంచి.. అగ్ని 5 మిస్సైల్ ప్రయోగాన్ని పర్యవేక్షించింది.