PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులకు మోదీ సూచనలు

తోటి విద్యార్థులతో పోల్చుకోవద్దు. మీకు సాధ్యమైనంత కృషి చేస్తూ ముందుకు సాగాలి. మీ మిత్రుల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. పక్కవారితో పోటీ పడొద్దు. మీతో మీరే పోటీ పడాలి. కొన్నిసార్లు విద్యార్థులు స్థాయికి తగినట్లుగా రాణించలేకపోతున్నామని ఒత్తిడికి లోనవుతుంటారు.

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 03:50 PM IST

PM Modi: చదువు విషయంలో పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తేవొద్దని సూచించారు ప్రధాని మోదీ. వారి ప్రోగ్రెస్ రిపోర్టును పేరెంట్స్ విజిటింగ్ కార్డులా భావించకూడదన్నారు. ప్రతి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యే సమయంలో ప్రధాని మోదీ.. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పరీక్షా పే చర్చాలో పాల్గొంటారనే సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఢిల్లీలో సోమవారం జరిగిన ‘పరీక్ష పే చర్చ’లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.

YS SHARMILA REDDY: సాక్షిలో నాకు సగం వాటా.. నన్ను తిట్టడానికి రోజకో జోకర్‌ వస్తున్నాడు: వైఎస్ షర్మిల

“ఈ కాలం విద్యార్థులు కొత్తగా ఆలోచిస్తున్నారు. పోటీతత్వం, సవాళ్లు జీవితంలో ఎంతో స్ఫూర్తినిస్తాయి. విద్యార్థుల్లో పోటీతత్వం తప్పనిసరిగా ఉండాలి. కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలి. తోటి విద్యార్థులతో పోల్చుకోవద్దు. మీకు సాధ్యమైనంత కృషి చేస్తూ ముందుకు సాగాలి. మీ మిత్రుల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. పక్కవారితో పోటీ పడొద్దు. మీతో మీరే పోటీ పడాలి. కొన్నిసార్లు విద్యార్థులు స్థాయికి తగినట్లుగా రాణించలేకపోతున్నామని ఒత్తిడికి లోనవుతుంటారు. ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకొని.. క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి. అలా చేస్తే మీరు పరీక్షలకు ముందే సిద్ధమవుతారు. ఆరోగ్యకరమైన మేథస్సు కోసం ఆరోగ్యమైన శరీరం కూడా అవసరం. పేరెంట్స్‌, టీచ‌ర్లు, బంధువులు ఎవ‌రు కూడా విద్యార్థుల‌పై ప‌దేప‌దే నెగ‌టివ్ పోలిక‌లు చేయ‌కూడ‌దు. ఎందుకంటే అది ఆ విద్యార్థి మాన‌సిక స్థితిపై ప్ర‌భావం చూపుతుంది. రోజుకు పది నుంచి పన్నెండు గంటలు చదవాలని తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తేవొద్దు. మీ పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను మీరు విజిటింగ్ కార్డులా భావించొద్దు. మీ పిల్లలను ఇతర విద్యార్థులతో పోల్చవద్దు.

khiladi lady: లూటీ చేసిన బ్యూటీ.. ఈమె చాలా డేంజర్‌ గురూ..

అలా చేస్తే వారి భవిష్యత్తుకు హాని కలిగించిన వారవుతారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఎప్పుడూ విశ్వాసం తగ్గిపోకూడదు. విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాతలు. అందుకే ఈ కార్యక్రమం నాకూ ఓ పరీక్షలాంటిదే. విద్యార్థుల మ‌నోధైర్యాన్ని దెబ్బ‌తీయ‌కుండా చాలా సున్నిత విధానంలో సంభాష‌ణ‌లు చేయాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం మొదటి రోజు నుంచే ప్రారంభం కావాలి. అప్పుడే పరీక్షల సమయంలోనూ పిల్లలు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. ఉపాధ్యాయులు తమ ఉద్యోగాన్ని కేవలం జాబ్‌గా భావించకూడదు. విద్యార్థుల భవిష్యత్తు… సాధికారత కోసం పని చేస్తున్నట్లుగా గుర్తించాలి. ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయులు సమానంగా చూడాలి” అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థుల్ని, ఒక ఉపాధ్యాయుడిని ఆహ్వానించారు.