PM MODI: పులులతో ప్రధాని.. కాజీరంగా నేషనల్ పార్కులో మోదీ..!

మోదీ కూడా కెమెరా చేతబట్టి.. అక్కడి అద్భుత దృశ్యాల్ని క్లిక్ మనిపించారు. ప్రకృతి దృశ్యాలను బైనాక్యులర్ల సాయంతో వీక్షించారు. ముందు ఏనుగుపై ఎక్కి సవారీ చేశారు. ఆ తర్వాత జీపులో సవారీ చేస్తూ.. పులులు, ఏనుగులు, ఖడ్గ మృగాలు సహా అడవి జంతువులను వీక్షించారు.

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 02:04 PM IST

PM MODI: అసోం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం అక్కడి కాజీరంగా నేషనల్​ పార్క్​ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా అందరూ కాజీరంగా నేషనల్​ పార్క్​ని సందర్శించాలని, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని సూచించారు. శనివారం ఉదయం జీప్​లో సఫారీకి వెళ్లిన మోదీ ‘ఎలిఫెంట్ రైడ్’ని ఆస్వాదించారు.

KCR: కేసీఆర్ మీద పోలీస్‌ కంప్లైంట్‌.. ప్రణీత్‌ రావు వెనక ఉంది ఆయనేనా..?

మోదీ కూడా కెమెరా చేతబట్టి.. అక్కడి అద్భుత దృశ్యాల్ని క్లిక్ మనిపించారు. ప్రకృతి దృశ్యాలను బైనాక్యులర్ల సాయంతో వీక్షించారు. ముందు ఏనుగుపై ఎక్కి సవారీ చేశారు. ఆ తర్వాత జీపులో సవారీ చేస్తూ.. పులులు, ఏనుగులు, ఖడ్గ మృగాలు సహా అడవి జంతువులను వీక్షించారు. లఖిమై, ప్రద్యుమ్న, ఫూల్మై అనే ఏనుగులకు ఆహారం తినిపించారు. అనంతరం అక్కడి మహిళా పోలీసులతో మోదీ ముచ్చటించారు. ”అడవులు, వన్యప్రాణులను ధైర్యంగా సంరక్షిస్తున్న మహిళా ఫారెస్ట్ గార్డుల బృందంతో మాట్లాడాను. మన సహజ వారసత్వాన్ని పరిరక్షించడంలో వారి అంకితభావం, ధైర్యం నిజంగా స్ఫూర్తిదాయకం. మీరందరూ కాజీరంగా నేషనల్ పార్క్​ను సందర్శించి, దాని ప్రకృతి దృశ్యాల అసమాన సౌందర్యాన్ని, అసోం ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని కోరుతున్నాను.

అసోం మీ హృదయానికి దగ్గరవుతుంది” అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మోదీ పర్యటన సందర్భంగా కాజీరంగా నేషనల్ పార్కులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక.. కాజీరంగా నేషనల్ పార్క్‌కి యునెన్సకో చారిత్రక సంపదగా గుర్తింపు కూడా దక్కింది. ఈ పర్యటనలో ప్రధానితోపాటు పార్క్ డైరెక్టర్ సోనాలీ ఘోష్‌, అటవీ అధికారులున్నారు.