Narendra Modi: వివాహాలకోసం విదేశాలకు కాదు.. జమ్ము కాశ్మీర్ రండి: మోదీ

గురువారం ప్రధాని మోదీ.. జమ్ము కాశ్మీర్‌లో పర్యటించారు. శ్రీనగర్‌లో రూ.6400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా స్థానిక బక్షీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 08:11 PM IST

Narendra Modi: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాతే జమ్మూ-కశ్మీర్‌ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ చట్టం రద్దుతో ఈ ప్రాంతంలో అభివృద్ధి సరికొత్త శిఖరాలను తాకుతోందని చెప్పారు. గురువారం ప్రధాని మోదీ.. జమ్ము కాశ్మీర్‌లో పర్యటించారు. శ్రీనగర్‌లో రూ.6400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.

BJP-TDP-JANASENA: టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు.. మరికొన్ని గంటల్లో క్లారిటీ..

ఈ సందర్భంగా స్థానిక బక్షీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘‘నేడు అంకితం చేస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులు జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి ఊతం ఇస్తాయి. అద్భుతమైన శ్రీనర్‌ ప్రజల్లో నేను ఒకడిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ మనసులు గెలుచుకునేందుకే నేను శ్రీనగర్ వచ్చా. ఆర్టికల్‌ 370తో జమ్మూకాశ్మీర్‌‌కు ఇంతకాలం ఏం లాంభం జరిగింది..? దీని ద్వారా కేవలం రాజకీయ కుటుంబాలే లబ్ది పొందాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. గత ఏడాది కాశ్మీర్‌లో 2 కోట్ల మంది పర్యటించారు. ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు జమ్మూకశ్మీర్‌కు తరలివస్తున్నారు. ఆర్టికల్‌ 370పై ఒక్క జమ్మూ-కశ్మీర్‌తోపాటు మొత్తం దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుదోవ పట్టిస్తోంది. ఈ ప్రాంతం దేశానికి కిరీటం. రైతుల సాధికారత, పర్యటక అవకాశాలు వికసిత జమ్మూ-కశ్మీర్ నిర్మాణానికి బాటలు వేస్తాయి. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ యువత కొత్త అవకాశాలు అందుకుంటున్నారు.

అందరికీ సమాన అవకాశాలు, హక్కులు లభిస్తున్నాయి. నా నెక్ట్స్‌ మిషన్‌ ‘వెడ్డింగ్‌ ఇన్‌ ఇండియా’. జమ్మూకశ్మీర్‌ను వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ హబ్‌గా తయారు చేయబోతున్నాం. జమ్మూకశ్మీర్‌లో ‘వెడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే మా లక్ష్యం. జమ్మూకశ్మీర్‌ విజయగాథ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. కశ్మీర్‌ సరస్సుల్లో ఎక్కడ చూసినా కమలం పూలు కన్పిస్తాయి. 50 ఏళ్ల క్రితం ఏర్పడిన జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లోగో కూడా కమలమే. బీజేపీ సింబల్‌ కూడా కమలమే” అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ పర్యటన సందర్భంగా కశ్మీర్‌ లోయలో హైఅలర్ట్‌ ప్రకటించారు.