Hema ku Shock : హేమకు పోలీసుల నోటీసులు.. ఇప్పుడేం వండుతుంది ?

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ సహా 86 మంది డ్రగ్స్ తీసుకోవడం కలకలం రేపుతోంది. ఇప్పుడు వీళ్ళందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు.

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ సహా 86 మంది డ్రగ్స్ తీసుకోవడం కలకలం రేపుతోంది. ఇప్పుడు వీళ్ళందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. సోమవారం CCB పోలీసుల ముందు హాజరుకావాలని కోరారు.

బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదనీ… హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని ఒకసారి… ఇంట్లో బిర్యానీ వండుకుంటున్నా అని మరోసారి వీడియోలు పెట్టి హేమ నవ్వుల పాలైంది. అయితే తన అసలు పేరు కృష్ణవేణిని బెంగళూరు పోలీసులకు చెప్పి… కేసులో తాను లేనని జనాన్ని బురిడీ కొట్టించాలనుకుంది. చివరకు బ్లడ్ శాంపిల్స్ తీసుకునేటప్పుడు తన పేరు బయటపెడితే ఆత్మహత్య చేసుకుంటానని కూడా పోలీసులను హేమ బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. ఆమె బెంగళూరుకు వెళ్ళినట్టు… రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు ఆధారాలతో సహా అన్ని విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు రక్త పరీక్షలు నిర్వహిస్తే అందులో హేమ సహా 86 మంది రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్ళు బయటపడ్డాయి. వీళ్ళందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

సోమవారం CCB ముందు హాజరు కావాలని కోరారు. నోటీసులు అందుకున్న వారిలో హేమ కూడా ఉంది. అసలు పార్టీ నిర్వహించిందే హేమ అని ఆరోపణలు వస్తుండటంతో… ఆమెను విచారించి వదిలేస్తారా ? లేకపోతే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా అన్నది చూడాలి. అయితే కర్ణాటకలో గత ఏడాది కాలంగా డ్రగ్స్ తీసుకున్న వారికి పోలీసులు కౌన్సెలింగ్ తోనే సరిపెడుతున్నారు. కేవలం డ్రగ్ పెడ్లర్స్ పైనే కేసులు పెడుతున్నారు. రేవ్ పార్టీ విషయంలో ఐదుగురు నిందితులను ఇప్పటికే బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ డ్రగ్స్ బాధితులైన హేమ సహా 86 మంది విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ నోటీసులపై హేమ ఎలా స్పందిస్తుంది… ఈసారి ఏమని వీడియో పెడుతుందని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.