ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు అయ్యే అవకాశం కనపడుతోంది. ఇటీవల జాతీయ అవార్డ్ తీసుకోవడానికి జానీ మాస్టర్ బెయిల్ కోరగా కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై అత్యాచార కేసు నమోదు అయిన నేపధ్యంలో నేషనల్ అవార్డ్ ని రద్దు చేసారు. దీనితో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసారు.
రంగారెడ్డి జిల్లా పొక్సో కోర్టులో పిటిషన్ వేసారు నార్సింగి పోలీసులు. మధ్యంతర బెయిల్‌పై రిలీజ్ కావడం లేదంటూ.. మెమో ద్వారా జానీ మాస్టర్ అడ్వకేట్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ అడ్వకేట్ మేమో దాఖలు చేసారు. రెగ్యులర్ బెయిల్‌పై విచారణ ఈ నెల 9 కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది.