Pawan Kalyan: ఆధారాలు చూపించండి.. పవన్ కల్యాణ్ కు పోలీసుల నోటీసులు..!

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో జరిగే చర్యలను ముందుగానే ఊహిస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 01:23 PM IST

పవన్ కళ్యాణ‌్ రాజకీయంగా పెద్దగా రాణించలేనప్పటికీ సినిమా పరంగా మంచి స్టార్ డం ఉన్న హీరో. ఈయన ఏం చెప్పినా చాలా మందిపై ప్రభావం పడుతుంది. అది మంచి కావచ్చు. చెడు కావచ్చు. అయితే దీనిని జనసేనాని మంచి కంటే చెడుకే ఎక్కువగా ప్రభావితం చేసేలా మాట్లాడుతున్నారన్నది ప్రస్తుత వాదన. దీనికి సరిపడేలా పవన్ తీరు, ప్రవర్తన కూడా అలాగే కనిపిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

గతంలో వాలంటీర్లపై..

గతంలోనూ వాలంటీర్లపై అందులోనూ మహిళలపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు జనసేనాని. దీనికి సంబంధించి ఎన్ఐఏ బృందం తనతో ఈ విషయాలు చెవిలో చెప్పినట్లు ప్రకటించారు. దీనిపై మహిళా ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ గా తీసుకున్నారు. ఆ తరువాత కొంత కాలాలనికి తనదైన శైలిలో స్పందించారు. నేను వాలంటీర్ల పొట్ట కొట్టాలనుకోలేదు. మరో ఐదువేలు ఎక్కువ ఇచ్చే మనసు నాకు ఉందంటూ కప్పిపుచ్చుకున్నారు. రాజకీయంగా ఎదగాలనుకున్న నేత ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఆయన మాటలు ప్రజలపై ఎంత ప్రభావం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి వాటిని ఆరోపించే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని మాట్లాడాలంటున్నారు రాజకీయ పండితులు.

నేడు వారాహి యాత్రపై..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. పెడనలో జరుగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరుగుతోందంటూ పవన్‌ ఆరోపించారు. మచిలీపట్నం జనవాణి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ సంచలన ఆరోపణలు చేశారు. పెడన వారాహి యాత్రలో రాళ్ల దాడులు చేసి, రక్తపాతం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నారని పవన్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్‌చేశారంటూ పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు. ఈ సమాచారం ఎక్కడి నుంచి ఉందో చెబితే భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తారు పోలీసులు. అలా కాకుండా రాజకీయ పరమైన ఆరోపణలు సున్నితమైన లా అండ్ ఆర్ఢర్ పై రుద్దితే అసలుకే మోసం వచ్చే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని గుర్తించాలన్నది కొంతమంది పరిశీలకులు వాదన. ఇలా చేయడం వల్ల అదిగో పులి వచ్చే కథలా అవుతుందని సూచిస్తున్నారు విశ్లేషకులు.

పోలీసుల ఏమంటున్నారు..

సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదు. బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయి. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలి. మా సమాచార వ్యవస్థ మాకుంది. పవన్‌ కంటే నిఘా వ్యవస్థ మాకు బలంగా ఉంది. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు ఎస్పీ జాషువా. అయితే ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా వెల్లడించారు. ‘‘పవన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందుకే నోటీసులు ఇచ్చాం. దాడులు జరగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియపర్చమని కోరాం. మేం పంపిన నోటీసులకు పవన్‌ నుంచి ఎలాంటి రిప్లై లేదు. రిప్లై రాలేదంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారాని అనుకోవాలా?. ఎటువంటి సమాచారంతో పవన్‌ వ్యాఖ్యలు చేశారని సమాధానం కోరారు.

T.V.SRIKAR