CM Revanth Reddy, Notices : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీస్ సమన్లు.. అమిత్ షా ఫేక్ వీడియోపై కేసు

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు చెందిన ఓ ఫేక్ వీడియో కేసులో.. PCC అధ్యక్షుడి హోదాలో రేవంత్ కి నోటీసులు జారీ చేసింది

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు చెందిన ఓ ఫేక్ వీడియో కేసులో.. PCC అధ్యక్షుడి హోదాలో రేవంత్ కి నోటీసులు జారీ చేసింది ఢిల్లీ పోలీస్ యాంత్రంగాం.. సిద్దిపేట సభలో హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను.. తెలంగాణకు ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వక్రీకరించారని ఆరోపణతో.. తెలంగాణ డీజీపీ, సీఎస్ కు పోలీసులు నోటీసీలు జారీ చేసింది.

ఇక విషయంలోకి వెళితే.. దేశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిద్దిపేట్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన మాటలు మార్ఫింగ్ వీడియెను.. అన్ని వర్గాల రిజర్వేషన్లతో పాటు.. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నటూగా అమిత్ షా మార్ఫింగ్ డీప్ ఫేక్ వీడియో రూపొందించారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు తెలిసింది.

కాగా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా.. మరి కొందరు నేతలకు నోటీసులు జారీ చేస్తు.. కేంద్రహోంశాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసుల FIR నమోదు చేసింది.

SSM