ఖమ్మం (Khammam) జిల్లాలో రాజకీయ (Political) పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకూ కాంగ్రెస్ (Congress)తో కలిసి పోటీ చేస్తామన్న కామ్రేడ్లు ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి 14 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది సీపీఎం. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాల్లోని కీలక స్థానాలపై కన్నేసింది. మొదట ఏదో ఓ ప్రధాన పార్టీతో కలిసి పోటీ చేయాలని కామ్రేడ్లు భావించారు. కానీ బీఆర్‌ఎస్ (BRS) వామపక్షాలను పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పోటీ చేస్తామని ప్రకటించారు కూడా. కానీ వామపక్షాలు అడిగిన సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి వీలు కాలేదు. దీంతో ఒంటరిగానే పోటీ చేసేందుకు రెడీ అయ్యింది సీపీఎం(CPM). ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కమ్యూనిస్టులకు మంచి ఓట్‌బ్యాంక్ ఉంది. ప్రతీ ఎన్నికల్లో వీల్లే అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉంటూ వస్తున్నారు.
దీంతో వీళ్ల మద్దతు చాలా ప్రాంతాల్లో చాలా కీలకం. కానీ ఇప్పుడు వామపక్షాలు ఒంటరిగా పోటీ చేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్‌బ్యాంక్ భారీ స్థాయిలో చీలిపోతుంది. ఇది అటుతిరిగి ఇటు తిరిగి మళ్లీ బీఆర్‌ఎస్‌కే లాభంగా మారుతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పడుతున్న కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. దాదాపు పదేళ్ల తరువాత ఇప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస పార్టీ పుంజుకుంది. కాస్త కష్టపడితే అధికారం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి టైంలో ప్రతీ ఓట్ కాంగ్రెస్ పార్టీకి అవసరమే. కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు తీసుకున్న డిసిషన్‌తో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ పడేలా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్‌బ్యాంక్ చీలకుండా.. ఆ ఓట్లు తమకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటే తప్ప గెలుపు కష్టమే. లేకుంటే మొదటికే మోసం వస్తుంది అంటున్నారు విశ్లేషకులు.