గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హాయంలో ఛత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో పవర్ కమిషన్ నోటిసులపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. గత కొన్ని రోజులుగా ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు కేసుపై ప్రస్తుత, మాజీ అధికారులను జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ విచారిస్తోంది. దీంతో విద్యుత్ కొనుగోలు విషయంలో అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) కు నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నోటిసులపై కేసీఆర్ స్పందించారు.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. ‘బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం. తమ హయాంలో కరెంట్ విషయంలో గణనీయ మార్పులు చూపించామని పేర్కొన్నారు. 2013 వరకు విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను తాము అసాధారణ నిర్ణయాలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచామని.. విద్యుత్ సంక్షోభం (Electricity crisis) నుంచి గట్టెక్కించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంట్ విషయంలో గణనీయమైన మార్పు చూపించాం. కానీ రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కమిషన్ ఛైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తనపై కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.
విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ (Justice Narasimha Reddy) విచారణలో ఏమాత్రం నిష్పాక్షికత కనిపించట్లేదని మాజీ CM KCR అన్నారు. ‘విచారణ అనేది పవిత్రమైన బాధ్యత. కానీ కమిషన్ ఛైర్మన్ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. అందుకే నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు’ అని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డి తప్పుకోవాలని KCR సూచించారు.