Liquor Tender: ఏపీ నుంచి మద్యం వ్యాపారులు తెలంగాణకు మకాం మార్చారు.. ఎందుకో తెలుసా..?

ఏపీ నుంచి భారీగా తరలి వచ్చిన మద్యం సిండికేట్ వ్యాపారం.

  • Written By:
  • Publish Date - August 31, 2023 / 12:40 PM IST

ఏపీ నుంచి భారీగా తరలి వచ్చిన మద్యం సిండికేట్ వ్యాపారం. అక్కడ సరైన బ్రాండ్లు లభించక, ధరలు అధికంగా ఉండటం, పైగా ప్రభుత్వమే అబ్కారీ శాఖను నిర్వహించడం ఇవన్ని కలిపి తెలంగాణకు భారీ ఆదాయం తెచ్చే వనరుగా మారింది.అసలే ఎన్నికల కాలం.. పైగా మంచి మద్యం కరువుగా మారిన రాష్ట్రం. దీంతో అక్కడి వ్యాపారులందరూ తెలంగాణ బాట పట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఇప్పటికే అమర్ రాజా, కియా, ఫాక్స్ కాన్ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణకి తరలి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా మద్యం దుకాణాల టెండర్లు కూడా ఏపీ వాళ్లకే దక్కడం విశేషం. గతంలో ఏపీ వేదికగా జరిగిన మద్యం వర్తకాలు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయి. దీనికి నిలువెత్తు నిదర్శనం మన్నటి టెండర్ల దరఖాస్తు ప్రక్రియ. ఇందులో అప్లికేషన్లు వేసిన వాళ్లందరూ ఏపీ వాళ్లే కావడం గమనార్హం. ఒక్కోక్కరూ ఒక్కొక్కరి చేత పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీని వెనుక వైపీపీ నాయకులు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఒక ఎంపీ కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. నాయకులు తమకు అనుకూలమైన వారితోనో బంధువుల తోనో, సన్నిహిత, స్నేహితులతోనో దరఖాస్తు వేయించినట్లు చర్చ జరుగుతోంది. కొందరు నాయకులు సిండికేట్ లావాదేవీలు జరుపగా మరి కొందరు ప్రత్యక్షంగానే ఇందులో పాల్గొన్నారు. దీంతో లైసెన్సులు లభించిన వారిలో మొత్తం ఏపీ రాజకీయ నాయకులే ఉన్నట్లు తెలుస్తుంది.

వేలల్లో దరఖాస్తులు.. కోట్లలో ఆదాయం..

ఏపీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వైపీపీ నాయకులతో పాటూ ఇతర రాజకీయ, వ్యాపార వేత్తలు ఈ టెండర్ ప్రక్రియలో దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో ఎలాంటి ఆదాయం లేని తరుణంలో తెలంగాణలో మద్యం వ్యాపారం చేస్తూ తమ వ్యాపార లావాదేవీలను కొనసాగించాలని చూస్తున్నరు. అందులో భాగంగానే ఏపీ నుంచి మొత్తం 1000 కి పైగా అప్లికేషన్లు వేసినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు 70వేల కు లోపు ఉన్న దరఖాస్తులు ఇప్పుడు రెట్టింపు అయి లక్షా 30 వేలకు పైగా చేరుకున్నాయి. దీంతో తెలంగాణ ఎక్సైజ్ కి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.

దరఖాస్తులు వచ్చిన జిల్లాలు

రాయలసీమ నుంచి
కర్నూలు, అనంతపురం నుంచి కొందరు ప్రముఖ పారిశ్రమిక వేత్తలతో పాటూ రాజకీయ నాయకులు ఇందలు దరఖాస్తు చేసుకున్నారు. అందులోనూ పెద్ద సిండికేట్ గా ఏర్పడి బిడ్ కోట్ చేయడం గమనార్హం.

కోస్తా నుంచి..
నెల్లూరు నుంచి కూడా దాదాపు 200పైగా దరఖాస్తులు వచ్చాయి. ఏపీ నుంచి అత్యధికంగా అప్లికేషన్లు వేసిన లిస్ట్ లో రెండవస్థానంలో ఉంది. ఒకరే 500 పైగా దరఖాస్తులు చేసుకున్నారని తెలిసింది.

గోదావరి నుంచి ఇలా..

ఇలాంటి విషయాలలో గోదావరి జిల్లాలకు చెందిన వారు కాస్త ప్రత్యేకం అని చెప్పాలి. తూర్పు గోదావరి నుంచి 1000కి పైగా దరఖాస్తులను ఒక్కరే సిండికేట్ గా ఏర్పడి బిడ్ వేయడం కాస్త ఆసక్తిని కలిగించింది. ఇందులో డజనుకుపైగా మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరైనట్లు తెలుస్తుంది.

పశ్చిమ గోదావరి నుంచి కొందరు గ్రూప్ గా ఏర్పడి దగ్గర దగ్గర 700 అప్లికేషన్లు వేయగా వీరికి 5 మద్యం షాపులు మంజూరయ్యి.

ఉత్తరాంధ్ర కాస్త తక్కువే..

విజయనగరం నుంచి మద్యం వ్యాపారం చేసే వ్యక్తి ఒక్కరే తన తరఫున 150 దరఖాస్తులు చేశారు. ఇతనికి 4 పైగా మద్యం షాపుల లైసెన్సులు దక్కాయి.

విశాఖపట్నం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక సమూహంగా ఏర్పడి వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకోగా 10కి పైగా షాపులను దక్కించుకున్నారు.

మన ఏపీ ఎక్సైజ్ ఆదాయం మొత్తం గండి పడి తెలంగాణకు తరలి వెళ్ల్తోందని కొందరు చింతిస్తుంటే.. మద్యం వ్యాపారంలో తమకు లైసెన్సులు దక్కినందుకు ఖుషీ అవుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ లైసెన్స్ దరఖాస్తులు జరిగినప్పటికీ తెలంగాణలో కేవలం అతి కొద్ది మందే పాల్గొనడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.

T.V.SRIKAR