Delhi Pollution: ఢిల్లీని వణికిస్తున్న కాలుష్యం.. లాక్ డౌన్ విధించే అవకాశం..?

ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ తాజాగా 302 కు చేరుకుంది. దీని ప్రభావంతో అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ యావరేజ్ ఎయిర్ క్వాలిటీ సూచీ 200 నుంచి 300 మధ్య ఉంటుంది. ప్రస్తుతం అయితే ప్రమాదస్థాయికి చేరుకుంది.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 10:48 AM IST

ఢిల్లీ నగరం తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఒకవైపు అక్టోబర్ ముగుస్తోంది. నవంబర్ అంటే చలికాలం ప్రారంభమవుతోంది. ముందుగానే పొగమంచుతో దట్టంగా కప్పేస్తూ ఉంటుంది వాతావరణం. దీనికి తోడూ కాలుష్యం కారణంగా మరింత మసకగా ఏర్పడ్డాయి పరిస్థితులు. మన్ననే దసరా ముగిసింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రావణదహనం చేస్తారు. ఈ బాణాసంచా ప్రభావం ఢిల్లీపై పడే ప్రమాదం ఉంది. అలాగే మరో 10 రోజుల తరువాత దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. దేశంలోని ప్రతి నగరం అంగరంగవైభవంగా ఈ పండుగను జరుపుకుంటుంది. ఢిల్లీలో పటాసులు పేల్చకున్నా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెలువడే పొగ ద్వారా తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండి. అలాగే ప్రస్తుతం ఉన్న ఏక్యూఐ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

దేశ రాజధాని నగర వాతావరణ పరిస్థితిపై సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ అధ్యయనం చేసింది. దీని నివేదిక ప్రకారం ఢిల్లీలో మధ్యాహ్నానికి వాయు కాలుష్యం ఉధృతి గణనీయంగా పెరిగిపోతుందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న 330 ఏక్యూఐ లెవెల్స్ అలాగే కొనసాగితే లాక్ డౌన్ విధించక తప్పదని సూచిస్తోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పులకు ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రజలు ప్రైవేట్ వాహనాలు, కర్భనాల పొగ వెలువడే వాహనాలను తీసుకొని రోడ్లపైకి రావొద్దని హెచ్చరిస్తోంది. ఒకవేళ అలా వస్తే పార్కింగ్ ప్రదేశాలలో వాటిని ఉంటేందుకు గంటకు భారీ ఎత్తున ఫైన్లు విధించాలని సూచిస్తోంది. ప్రజా రవాణాను ఉపయోగించమని కోరింది. ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సేవలను భారీ ఎత్తున పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ ప్లాన్ లో భాగంగా ప్రస్తుతం ఈ ఆదేశాలను జారీ చేశారు. రానున్న రోజుల్లో కాలుష్యం మరింత పెరిగితే కొత్త ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ కాలుష్యం స్టేజ్ 3 కి చేరుకుంటే అత్యవసర వాహనాలపై కూడా నిషేధం విధించవచ్చు. రైల్వేలు, జాతీయ భద్రతా ప్రాజెక్టులు, ఆసుపత్రులు, మెట్రో, హైవేలు, రోడ్లు మినహా ఇతర ప్రాజెక్టులను నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేజ్ 3 కూడా దాటితే లాక్ డౌన్ తరహా పరిస్థితులను విధించే అవకాశం ఉంది. గతంలో లాగా సరి, బేసి సిస్టమ్ ను అమలుపరచనుంది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తారు. కేవలం 50శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు. అన్ని ప్రైవేట్ కార్యాలయాలకు వర్క్ ఫ్రం హోం అమలు చేసేలా సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

T.V.SRIKAR