T CONGRESS: ఎన్నికల తర్వాత సీఎంగా పొంగులేటి..? కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?

పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి పొంగులేటి.. తెలంగాణ ఏకనాథ్ షిండే అవుతారంటూ.. సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. ఐతే దీనికి పొంగులేటి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తాను సీఎం అంటూ వస్తున్న కథనాలన్నీ ఊహాజనితం అంటూ కొట్టిపారేశారు.

  • Written By:
  • Updated On - March 21, 2024 / 06:32 PM IST

T CONGRESS: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చినప్పటి నుంచి మొదలైన చర్చ.. ఇప్పటికీ రకరకాల రూపాలు తీసుకుంది. కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ కాలం నిలవదు అంటూ.. బీఆర్ఎస్‌, బీజేపీ నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. దీనికి రేవంత్‌ నుంచి కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్ వస్తుందనుకోండి. తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండే ఎవరు అంటూ జరిగిన, జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ వ్యవహారం తెరమీదకు వచ్చింది.

TDP-BJP-JANASENA: అభ్యర్థులను ఇంకా ప్రకటించని బీజేపీ.. ఆలస్యానికి అసలు కారణాలివేనా?

పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి పొంగులేటి.. తెలంగాణ ఏకనాథ్ షిండే అవుతారంటూ.. సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. ఐతే దీనికి పొంగులేటి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తాను సీఎం అంటూ వస్తున్న కథనాలన్నీ ఊహాజనితం అంటూ కొట్టిపారేశారు. పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయని.. తన దగ్గర పండ్లు ఉన్నాయని.. సీఎం రేవంత్ వెంట రోజు ఉంటే.. తాను ఎలా నంబర్ 2 అవుతానని ప్రశ్నించారు. తాను సీఎం కావాలంటే.. హైకమాండ్‌ కూడా కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా అన్నారు. తాను సీఎం కావాలని అనుకోవట్లేదని.. అసలు ఆ ఆలోచన కూడా లేదని.. తాను ఎవరికీ టచ్‌లోకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రధానిని కలిసినంత మాత్రాన పొల్యూట్ అయినట్లు కాదని క్లియర్‌కట్‌గా చెప్పేశారు. పొంగులేటి క్లారిటీ ఇచ్చినా.. ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఖమ్మం ఎంపీ టికెట్ తన సోదరుడికి ఆశిస్తున్న పొంగులేటి.. అది జరగకపోతే ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని.. సోషల్‌ మీడియా వేదికగా ఎవరికి వారు ప్రచారం మొదలుపెట్టారు.

దీంతో ఇప్పుడు పొంగులేటి చుట్టే కాంగ్రెస్ రాజకీయ చర్చ కనిపిస్తోంది. ఇక అటు తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ల వ్యవహారం కొత్తం పంచాయితీకి దారి తీసింది. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ సీనియర్ నేత మల్లు రవికి దాదాపు ఖరారు అయినట్లు వార్తలు రావడంతో మరో నేత సంపత్ కుమార్ భగ్గుమన్నారు. తనకు కాకుండా మల్లు రవికి టికెట్ రావడం వెనుక ఖమ్మం కోటరీ ఉందంటూ పొంగులేటి పేరును ప్రస్తావిస్తూ ఫైర్ అయ్యారు. ఈ విషయమై నేరుగా సోనియాగాంధీకే లేఖ రాశారు.