Poonam Kaur: కనికరం లేదా..? షర్మిలపై పూనం కౌర్‌ సంచలన కామెంట్స్‌

పిల్లలు, ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడలేనివాళ్లు రాజకీయాల్లో ఉండి ప్రయోజనమేంటంటూ ప్రశ్నించారు. తెనాలిలో ప్రతీ ఒక్క మహిళ ఈ విషయంలో ఆలోచించాలంటూ పోస్ట్‌ చేశారు.

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 03:50 PM IST

Poonam Kaur: గీతాంజలి అనుమానస్పద మృతి ఏపీ రాజకీయాలను ఇప్పుడు కుదిపేస్తోంది. ఆమె చావుకు అసలు కారకులు మీరంటే మీరని వైసీపీ, టీడీపీ ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు హీరోయిన్‌ పూనం కౌర్‌. గీతాంజలి విషయంలో షర్మిల మౌనంగా ఉండటం తనను షాక్‌కు గురి చేసిందంటూ ట్వీట్‌ చేశారు. సమాజంలో లీడర్‌గా చెప్పుకునే మహిళలు ముందు ఇలాంటి విషయాలపై రియాక్ట్‌ అవ్వాలన్నారు.

PAWAN KALYAN: తెరమీద చెప్పిందే.. ఆర్జీవీ వ్యూహంలో చెప్పినట్టే పవన్‌ను తొక్కేస్తున్నారా..?

పిల్లలు, ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడలేనివాళ్లు రాజకీయాల్లో ఉండి ప్రయోజనమేంటంటూ ప్రశ్నించారు. తెనాలిలో ప్రతీ ఒక్క మహిళ ఈ విషయంలో ఆలోచించాలంటూ పోస్ట్‌ చేశారు. ప్రతీ ఒక్కరూ షర్మిల మౌనానికి సమాధానం చెప్పాలంటూ ట్వీట్‌ చేశారు. నార్మల్‌గా సోషల్‌ మీడియాలో పూనం తరచుగా పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ ఉంటుంది. ఇదే పూనం రీసెంట్‌గా జగన్‌ పాలన సూపర్‌ అని.. చేనేత కార్మికుల విషయంలో జగన్‌ ప్రభుత్వం చేసిన సేవ గ్రేట్‌ అంటే ట్వీట్‌ చేసింది. అలాంటి ఇప్పడు షర్మిల టార్గెట్‌గా ట్వీట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం గీతాంజలి మృతి ఏపీలో హాట్‌ టాపిక్‌గా ఉంది. నిజంగానే ఆమె ట్రోలింగ్‌ తట్టుకోలేక చనిపోయిందా.. ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. గీతాంజలి చావుకు కారణం మీరంటే మీరని అటు వైసీపీ నేతలు, ఇటు టీడీపీ-జనసేన నేతలు సోసల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

వైసీపీ నేతలు గీతాంజలికి న్యాయం జరగాలంటూ ర్యాలీలు కూడా చేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా ఈ విషయంలో లోతైన దర్యాప్తు జరగాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గీతాంజలి వీడియో వైరల్‌ ఐన తరువాత మొదట ట్రోల్‌ చేసిన కొందరు డిటెయిల్స్ లభించినట్టు గుంటూరు పోలీసులు చెప్తున్నారు. వాళ్లను విచారిస్తే కేసుఓ కొలిక్కి వచ్చే అవకాశముందని చెప్తున్నారు. ఈ మృతిపై చాలా అనుమానాలు బయటికి వస్తున్న నేపథ్యంలో గీతాంజలి మృతి పోలీసులకు ఇప్పుడు ఓ చిక్కుముడిగా మారింది.