Poonam Pandey: బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణవార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూనమ్ మరణించినట్లు.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనే తన మేనేజర్ వెల్లడించారు. సర్వైకల్ క్యాన్సర్ బారినపడటంతో.. పూనమ్ కన్ను మూశారని ఆ పోస్ట్‌లో వివరించారు. ఐతే పూనమ్ చనిపోయిందని చెప్పారు తప్ప.. ఎప్పుడు చనిపోయింది, ఎక్కడ చనిపోయింది.. అసలు ఆమె మృతదేహం ఎక్కడ.. మూడు రోజుల ముందు బాగానే ఉన్న పూనమ్.. సడెన్‌గా ప్రాణాలు వదలడం ఏంటి.. నిజంగా చనిపోయిందా.. ప్రాంక్ చేస్తున్నారా.. ?
Poonam Pandey: పూనమ్ పాండే మరణం.. వ్యాక్సిన్‌పై మళ్లీ చర్చ..
వివాదాలను వెంటేసుకొని తిరిగే పూనమ్.. కొత్త కాంట్రవర్సీకి తెరలేపుతుందా.. ఇలా సోషల్ మీడియాలో రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయ్. పూనమ్ చనిపోయిందా లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయ్. కొందరు ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతుంటే.. మరికొందరు మాత్రం ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే.. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. కేంద్రమంత్రి అలా ప్రకటించిన నెక్ట్స్ డేనే.. పూనమ్ చనిపోయినట్లు వార్తలు రావడం మరో చర్చకు కారణం అవుతోంది. మొన్నటివరకు కూడా షూటింగ్‌లలో పాల్గొన్న పూనమ్.. సడెన్‌గా చనిపోయినట్లు మేనేజర్ ప్రకటించడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. మాములుగా కేన్సర్ రోగి.. చివరి స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా వీక్ అవుతారు.
అలాంటి పూనమ్.. కొన్ని గంటల ముందు వరకు కూడా షూటింగ్స్ చేసింది. రెండు రోజుల ముందు అయితే.. గోవాలో పార్టీలో కనిపించింది. దీంతో మరిన్ని అనుమానాలు తెరమీదకు వస్తున్నాయ్. పూనమ్ చనిపోయింది అని చెప్పడానికి ఆధారం.. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మాత్రమే! అంతకుమించి ఏమీ లేదు. దీంతో ఆమె అకౌంట్ హ్యాక్ చేసి ఉండొచ్చు అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా.. పూనమ్ నిజంగా చనిపోయి ఉంటే.. కచ్చితంగా ఎవరో కుట్ర చేసి ఉంటారన్నది ఇంకొదరి అనుమానం. అప్పుడు ఆమె మరణం మీద విచారణ చేయాల్సి ఉంటుందన్నది ఇంకొందరి డౌట్. ఏమైనా.. పూనమ్ పాండే గురించి నెక్ట్స్ అప్డేట్ వస్తే తప్ప.. అసలు విషయం తెలిసే అవకాశం లేదు.