AP Postal Ballot : పోస్టల్‌ బ్యాలెట్లే ఏపీ విజేతను నిర్ణయించబోతున్నాయా!

గత వందేళ్లలో ఎప్పుడూ లేనంత ఉష్టోగ్రతలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వాతావరణం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. కానీ ఏపీలో పెరుగుతున్న పొలిటికల్‌ హీట్‌ ఈ టెంపరేచర్లను కూడా బీట్‌ చేసేలా కనిపిస్తోంది. ఏ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు.

గత వందేళ్లలో ఎప్పుడూ లేనంత ఉష్టోగ్రతలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వాతావరణం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. కానీ ఏపీలో పెరుగుతున్న పొలిటికల్‌ హీట్‌ ఈ టెంపరేచర్లను కూడా బీట్‌ చేసేలా కనిపిస్తోంది. ఏ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు.. వచ్చే ఎన్నికల్లో అధికారం ఎవరికి అనేది విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూటమికి ఏ స్థాయిలో ఆదరణ కనిపిస్తోందో.. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ (YCP) కి కూడా అదే స్థాయి ఆదరణ కనిపిస్తోంది.

దీనికి తోడు టికెట్లు దక్కిని నేతలు తమ పార్టీ అభ్యర్థులకు సహకరిస్తారా అని అన్ని పార్టీలు టెన్షన్‌ పడుతున్నాయి. ఇలాంటి టైంలో ప్రతీ ఓట్‌ చాలా కీలకం. అందులోనూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఇప్పుడు మరింత కీలకం కాబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా నియోజకవర్గాల్లో ఈ ఓట్లే డిసైండింగ్‌ ఫ్యాక్టర్‌ కాబోతున్నాయి. ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అప్లై చేసుకోవడంమే ఇందుకు నిదర్శనం. ఎలక్షన్‌ డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులు, వేరే దేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు, దివ్యాంగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వేస్తారు.

దీనికోసం ముందుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు లేనంతగా ఈసారి ఏపీలో భారీ సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అప్లికేషన్స్‌ వచ్చాయి. రెగ్యులర్‌ ఓట్ల కౌంటింగ్‌ పూర్తయ్యాక పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారు. అభ్యర్థుల మధ్య తక్కువ మార్జిన్‌ ఉన్న నియోజకవర్గాల్లో ఈ పోస్టల్‌ బ్యాలెట్లే విజేతను నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితి చూస్తే చాలా నియోజకవర్గాల్లో చిన్న మార్జిన్‌తోనే గెలుపు ఓటములు జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో ఈ పోస్టల్‌ ఓట్లే కీలకం కాబోతున్నాయి.