ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ . దేశంలో వివిధ పోస్టల్సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 44,228 పోస్టుల భర్తీ కోసం గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలి.
ఏయే పోస్టులు అంటే
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం)
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం)
డాక్ సేవక్
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ?
ఆంధ్రప్రదేశ్ – 1355 పోస్టులు
తెలంగాణ – 981 పోస్టులు
విద్యార్హతలు
India Post GDS ఉద్యోగాలకు అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి
India Post GDS కి : వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. OBCలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; SC, STలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము
India Post GDS Application Fee : అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ.100 చెల్లించాలి.
ఎంపిక విధానం
GDS ఎంపిక : పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలనికి పిలుస్తారు.
జీతం ఎంత ?
GDS Salary :
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు నెలకు రూ.12 వేల నుంచి 29,380 వరకు జీతం ఉంటుంది.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం
GDS Application Process :
ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్
https://indiapostgdsonline.gov.in/ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
ఇందులో మీ పర్సనల్ డిటైల్స్, ఈ-మెయిల్, ఫోన్ నంబర్లు ఎంటర్ చేయాలి. పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి. తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తరువాత Apply Online లింక్‌పై క్లిక్ చేసి, మీ డివిజన్, పోస్ట్ ప్రిఫరెన్స్‌లను ఎంచుకోవాలి.
మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో పాటు, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
మీ ఫొటో, సంతకంను అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
తర్వాత రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింటవుట్తీసి పెట్టుకోంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్లు : 2024 జులై 15
ఆన్లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ : 2024 ఆగస్టు 5
అప్లికేషన్స్ ఎడిట్ : 2024 ఆగస్టు 6 నుంచి 8 వరకు