Pothina Mahesh: అనుకున్నదే జరిగింది. పోతిన మహేష్.. జనసేనకు రాజీనామా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఆశించిన మహేష్‌కు చివరికి భంగపాటే మిగిలింది. 2019లో ఇదే స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. ఐతే ఈసారి మాత్రం పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీ దక్కించుకుంది. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి ఇక్కడి నుంచి.. కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. తనకు టికెట్ దక్కకపోవడంతో పోతిన మహేష్.. జనసేనకు రాజీనామా చేశారు. ఐతే ఇప్పుడు మహేష్ అడుగులు ఎటు అనే చర్చ జరుగుతోంది.
CHIRANJEEVI-PAWAN KALYAN: మెగా విరాళం.. జనసేనకు మెగాస్టార్ రూ.5 కోట్లు విరాళం
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతారంటూ ఆయన అనుచరులు చెప్పారు. ఐతే రాజీనామా తర్వాత పోతిన మహేష్ వ్యాఖ్యలతో కొత్త ప్రచారం తెర మీదికి వచ్చింది. వైసీపీలో ఆయన చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయ్. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని.. ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడలో అడుగుపెట్టిన తర్వాత.. ఆయన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఐతే పోతిన మహేష్ రాజీనామాతో కూటమికి టెన్షన్ స్టార్ట్ అయింది. విజయవాడలో బలమైన బీసీ నేతగా పోతిన మహేష్ ఉన్నారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకు.. 22 వేల 367 ఓట్లు వచ్చాయ్. విజయవాడలో పశ్చిమలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. మైనారిటీలు కూడా భారీగా ఉన్నారు. బీసీల మద్దతు పోతిన మహేష్‌కు ఉండే అవకాశాలు ఉన్నాయ్. ఇదే ఇప్పుడు కూటమిని టెన్షన్ పెడుతోంది. వైసీపీలో చేరినా.. లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా.. కూటమి ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు మూడు పార్టీలను టెన్షన్ పెడుతోంది. ఏమైనా విజయవాడ వెస్ట్ రాజకీయం ఈసారి సమ్‌థింగ్ స్పెషల్ అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.