గ్యాంగ్ స్టర్ వచ్చేశాడు. ముంబై తీరంలో అలజడి మొదలైంది. ఆకలి మీదున్న చిరుతలాపై విరుచుకుపడ్డారు. పులి.. జింకలను వేటాడినట్టుగా పవన్ శత్రువలను ఊచకోత కోస్తూ కనిపించాడు. ఓజీ నుంచి వచ్చిన గ్లింప్ నెక్ట్స్ లెవల్ లో ఉందనే చెప్పాలి. పవన్ లుక్స్, వైలైన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. అస్సలు ఊహించని రేంజ్లో ఎంతో పవర్‌ఫుల్‌గా పూనకాలు తెప్పించేలా ఉంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. అదిరిపోయే ట్రీట్ ఇచ్చేశారు ఓజీ మేకర్స్. చీతా లాంటి కళ్లతో ఒక్కోకరిని నరుక్కుంటూ పోయినే టీజర్ మొత్తం గూస్ బంప్ తెప్పించింది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా.. అది మట్టి చెట్లతో పాటు సగం ఊరును ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం.. ఇప్పటికీ ఏ తుపాను కడగలేకపోయింది. ఇట్ వజ్ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ పాత్.. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే.. సాలా సైతాన్ అంటూ పవన్రోల్ కు ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది. చివర్లో ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అంటూ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది.
1990 నాటి ముంబయి మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఎప్పుడో ప్రారంభమైంది. ముంబయిలో ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్రీకరణ జరుపుకుంది. మొత్తంగా ఈ గ్లింప్స్.. యూట్యూబ్ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టేస్తోంది. అలా వచ్చిందో లేదో అప్పుడే.. సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. మొత్తానికి పవన్ బర్త్ డే అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన ఫ్యాన్స్ ను ఖుషి చేశారు మేకర్స్..