Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు సందీప్ రెడ్డి షాక్..!

ప్రభాస్ ఫ్యాన్స్ కు సందీప్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ నోరు తెరవనివ్వకుండా మూసుకుని ఉండమంటున్నాడట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఏం జరుగుతోందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - February 28, 2023 / 04:48 PM IST

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి కోసమే రెబల్ స్టార్ ప్రభాస్, నోరు మూసుకుని ఉండాల్సి వస్తోంది. అరవొచ్చు. తిట్టొచ్చు… కాని సందీప్ రెడ్డి చేసిన పనికి ప్రభాస్ నోరు మూగబోతోంది. అలాంటి ఘనకార్యం చేశాడట సందీప్ రెడ్డి.

సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తర్వాత యానిమల్ అంటూ రణ్ బీర్ కపూర్ తో మూవీ తీస్తున్నాడు. అది ఆగస్ట్ 11 న రాబోతోంది. దసరాకు మాత్రం ప్రభాస్ తో సందీప్ రెడ్డి సినిమా లాంచ్ అవుతుంది. ఈ సంగతి ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ తెచ్చేదే.. కాని ఇక్కడే ట్విస్ట్ ఉంది.

ప్రభాస్ తో తను తీసే సినిమా మాస్ మతిపోగొట్టే యాక్షన్ ఎపిసోడ్స్ తో డిజైన్ చేశామన్నాడు సందీప్.. కాని ఇక్కడ ప్రభాస్ మాత్రం ఒక్క డైలాగ్ కూడా చెప్పలేడట. కారణం తన పాత్రే మూగ పాత్రని తెలుస్తోంది. ఓ మూగవాడు, మాట్లాడకుండా సైలెన్స్ లో వయొలెన్స్ చేయాల్సి వస్తే.., ఆ రీసౌండ్ చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి. మొత్తానికి స్పిరిట్ మూవీలో ప్రభాస్ మూగవాడి పాత్ర వేయబోతున్నాడనే లీక్, ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉందీ న్యూస్.