ఈ రైల్వే స్టేషన్లలో అతి తక్కువ ధరకే మెడిసిన్ విక్రయం.. ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే శాఖ కీలక నిర్ణయం

భారతదేశంలోనే అత్యంత పెద్ద ప్రయాణ వ్యవస్థగా రైల్వే ప్రసిద్ది చెందింది. ప్రతి రోజూ రైల్వే ద్వారా కొన్న లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వీరి సౌకర్యార్థం సరికొత్తగా ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలసుకుందాం.

  • Written By:
  • Publish Date - August 13, 2023 / 09:57 AM IST

సాధారణంగా ఎవరైనా ప్రయాణం చేయాలంటే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు మెడిసిన్ కిట్ ను ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ఎంత ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకం మందులు మరిచిపోతూ ఉంటాం. దీనికి కారణం ప్రయాణ హడావిడి అని చెప్పాలి. మరి కొందరైతే తెచ్చుకున్న మందులు అయిపోయి, స్టేషన్ బయట కొనాలంటే రైలు ఎక్కడ వెళ్లి పోతుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వారికోసం భారతీయ రైల్వే సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. దీంతో ప్రయాణాల్లో మెడిసిన్ ఇబ్బందులను అధిగమించవచ్చు అని చెబుతున్నారు రైల్వే అధికారులు.

ముందుగా ఈ కేంద్రాలను 50 ప్రదాన రైల్వే స్టేషన్లలో అందుబాలోకి తెచ్చారు. ఇక్కడ విజయవంతం అయితే క్రమక్రమంగా అన్ని ప్రదాన రైల్వే స్టేషన్లలో ఏర్పటు చేసేందుకు కార్యాచరణ రూపొందించటనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆనంద్ విహార్, దర్భంగా, శ్రీనగర్, మైసూర్, లక్నో, తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తూ ఉంటుంది కనుక ఇక్కడ మందులు ఎలాంటి కల్తీ లేకుండా విక్రయాలు జరుగుతాయి. పైగా తక్కువ ధరకే లభిస్తాయి. ఎమ్మార్పీ పై చాలా వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.

T.V.SRIKAR