Prashant Kishore : పార్టీ మార్చిన ప్రశాంత్ కిషోర్.. ఇక నుంచి టీడీపీకి సేవలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2019లో వైయస్సార్సీపీకి పనిచేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్.. ఇకపై టీడీపీకి తన వ్యూహాలను అందించబోతున్నారు. ఎలక్షన్ మేనేజర్ గా, రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే అత్యంత ప్రముఖుడైన పీకే 2019 ఎన్నికల కోసం వైఎస్ఆర్సిపికి పని చేశారు. జగన్ పార్టీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా ఉందనేది కొందరి అభిప్రాయం. ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ జగన్ సర్కార్ కి పనిచేస్తోంది.

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2019లో వైయస్సార్సీపీకి పనిచేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్.. ఇకపై టీడీపీకి తన వ్యూహాలను అందించబోతున్నారు. ఎలక్షన్ మేనేజర్ గా, రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే అత్యంత ప్రముఖుడైన పీకే 2019 ఎన్నికల కోసం వైఎస్ఆర్సిపికి పని చేశారు. జగన్ పార్టీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా ఉందనేది కొందరి అభిప్రాయం. ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ జగన్ సర్కార్ కి పనిచేస్తోంది. పీకే నేరుగా జగన్ కి, వైసీపీకి పనిచేయడం లేదు. కొద్ది రోజులుగా జగన్ కి ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. ఒకటి రెండు సార్లు బహిరంగ వేదికలపై జగన్ కి వ్యతిరేకంగా కూడా పీకే మాట్లాడారు.

ప్రస్తుతం పీకే ఒకప్పటి టీంమేట్ రాబిన్ సింగ్ తెలుగుదేశానికి వ్యూహకర్తగా పని చేస్తున్నారు. రాబిన్ సింగ్ పనితీరుపై చంద్రబాబు నాయుడుతోపాటు పార్టీ నేతలు ఎవరూ సంతృప్తిగా లేరు. కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ కి వ్యూహకర్తగా పని చేసిన సునీల్ కనుగోలు పేరు.. ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు తర్వాత దేశమంతా మార్మోగిపోతుంది. రాబిన్ ప్లేస్ లో సునీల్ కనుగోలును తీసుకోవాలని టీడీపీ భావించింది. కానీ సునీల్ నిరాకరించడంతో కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ తో చర్చలు ప్రారంభించింది టిడిపి. ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి తెర వెనుక నుంచి పనిచేయడానికి అంగీకరించారు.

2024 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే ఉండడంతో ఏ అవకాశాన్ని వదులుకోకూడదని చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ ను టిడిపికి పనిచేయడానికి ఒప్పించారు. పీకే ను లోకేష్ స్వయంగా వెంటబెట్టుకొని రావడం చూస్తే.. టిడిపిలో ప్రశాంత్ కిషోర్ ఎంత కీ రోల్ ప్లే చేయబోతున్నాడో అర్థమవుతుంది. గతంలో గుజరాత్ ఎన్నికల్లో బిజెపికి పనిచేసిన పీకే.. ఆ తర్వాత ఆ పార్టీని వ్యతిరేకించి వైఎస్ఆర్సిపి, తృణమూల్ కాంగ్రెస్ తోపాటు మరి కొన్ని ప్రాంతీయ పార్టీలకు సేవలందించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించారు పీకే. అయితే ఆయన ఏకంగా జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి లేదా జనరల్ సెక్రెటరీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రాహుల్ గాంధీ తిరస్కరించారు. ఆ తర్వాత పీకే బీహార్ పాలిటిక్స్ లో పాగా వేశారు.

జనతాదళ్ లో చేరి నితీష్ కుమార్ తో కలిసి పని చేశారు. నితీష్ తో కూడా విభేదించి చివరికి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు 6వేల కిలోమీటర్ల పాదయాత్ర లక్ష్యంగా పెట్టుకొని తిరుగుతున్నారు ప్రశాంత్ కిషోర్. ఎప్పటికైనా బీహార్ ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన లక్ష్యం. బ్రాహ్మణ కులానికి చెందిన పీకే.. తన రాజకీయ ఎత్తుగడల ద్వారా ముఖ్యమంత్రి అవకాశం దొరికితే.. ప్రధాని అవ్వాలని టార్గెట్ తో ఉంటారు. భారతీయులు.. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ మనోభావాలను, భావోద్వేగాలను బాగా స్టడీ చేసిన ప్రశాంత్ కిషోర్.. గెలవడానికి ఏ అడ్డదారులైన తొక్కడానికి వెనుకాడరు. ఆంధ్ర వాళ్లకి కులపిచ్చ. అందుకని వాళ్ళని కులంతోనే కొట్టాలి. కులంతో విభజించి ఓట్లు రాబట్టాలి. అనే ఐడియాను సృష్టించి జగన్ ఇచ్చింది ప్రశాంత్ కిషోర్. సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేయడంలో పీకే దిట్ట.

జగన్ పై కోడి కత్తి దాడి, మమతా బెనర్జీ కాలు విరిగిన దుర్ఘటన.. ఇలాంటివన్నీ ప్రశాంతి కిషోర్ సృష్టించినవే అని చెప్పుకుంటారు. దేశంలో తానే పెద్ద రాజకీయ వ్యూహకర్తనని చెప్పుకునే చంద్రబాబుకి కూడా చివరికి ప్రశాంత్ కిషోర్ దిక్కయ్యారు. లోకేష్ ఒత్తిడితోనే ప్రశాంత్ కిషోర్ ను పార్టీకి స్ట్రాటజిస్ట్ గా తీసుకోవాలని బాబు అంగీకరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి పనిచేయడానికి పీకే బృందం 400 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. ఇప్పుడు టిడిపి నుంచి పీకే ఎంత వసూలు చేస్తారో చూడాలి. అలాగే ప్రశాంత్ కిషోర్ ని తిట్టిపోసే పవన్ కళ్యాణ్.. ఆయనతో ఎలా కలిసి పని చేస్తారో కూడా చూడాలి. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం రంజుగా ఉంటుందనేది పీకే ఎంట్రీతో మరోసారి రుజువైంది.