ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్లో కోల్‌కతా ప్రత్యర్థిని తేల్చబోయే ఆసక్తికర మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలయింది. తొలి క్వాలిఫయర్‌లో చిత్తుగా ఓడి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హైదరాబాద్ రాజస్థాన్ తో తలపడనుంది. గ్ స్టేజ్‌లో దూకుడుగా ఆడిన సన్‌రైజర్స్ ఇప్పుడు డీలా పడింది. కాగా హైదరాబాద్ జట్టులో బ్యాటింగ్ త్రయం అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్ , హెన్రిచ్ క్లాసెన్ గత ఓటమి నుంచి తేరుకుని మరోసారి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాలి. మిడిలార్డర్‌లో నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్ నిలకడ చూపించాలి.
గత మ్యాచ్ లో కీలక బ్యాటర్లు అంచనాలు అందుకోలేక పోయారు. ఈ కారణంగానే సన్ రైజర్స్ కోల్ కత్తా చేతిలో ఓడిపోయింది. దీంతో లీగ్ స్టేజ్ లో పరుగుల వరద పారించిన సన్ రైజర్స్ ప్లేయర్స్ రెండో క్వాలిఫయర్ లో చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇక పేస్ బౌలింగ్ విషయానికొస్తే హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ కలిసి 45 వికెట్లను పడగొట్టారు. హైదరాబాద్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం మైనస్ పాయింట్. పేసర్లు మరోసారి రాణిస్తే రాజస్థాన్ రాయల్స్ ను కట్టడి చేయొచ్చు. ఈ సీజన్‌లో అయితే ఇప్పటికి రాజస్థాన్ పై హైదరాబాద్‌దే పైచేయిగా నిలిచింది.