Israel: రసాయన ఆయుధాలతో దాడులు చేస్తున్న హమాస్.. కీలక ఆధారాలు లభించాయన్న ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ - హమాస్ గడిచిన 15 రోజులుగా ఒకరిపై ఒకరు భీకర దాడులకు పాల్పడుతున్నారు. ఇందులో వేల మంది అమాయక ప్రజలు మరణించారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ రసాయన ఆయుధాల ప్రయోగానికి సిద్దమైనట్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నయని వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - October 23, 2023 / 11:43 AM IST

హమాస్ – ఇజ్రాయెల్ యుద్దం కేవలం ప్రత్యేక రాజ్యం కోసం, పరిపాలనా హక్కుల కోసం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ ఇజ్రాయెల్ పై తన మిలిటెంట్లతో మూకుమ్మడిగా దాడి చేసింది. దీని దెబ్బకు ఇజ్రాయెల్ లో నివసించే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆర్థిక, సాంకేతిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇజ్రయెల్ అధ్యక్షుడు హమాస్ రసాయన దాడులు చేసేందుకు సిద్దమైంది అని చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇరుదేశాల పోరులో మృతిచెందిన హమాస్ సైనికుడి వద్ద అనేక ఆధారాలు లభించాయన్నారు.

రసాయన ఆయుధాలు తయారు చేసే పూర్తి సమాచారంతో పాటూ సామాగ్రి హమాస్ వద్ద ఉన్నట్లు తెలిపారు. దీనిని ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థల నుంచి పొందినట్లు ఆరోపించారు. ఈ సైనికుడి వద్ద సైనైడ్ దిస్పర్షన్ డివైజ్ లభించినట్లు చెప్పారు. దీనిని ఎలా వాడాలో తెలిపే యూఎస్బీ అందులో ఉన్నట్లు తెలిపారు. మరో సైనికుడి వద్ద ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన జండాలు, పత్రాలు లభించినట్లు వివరించారు. చిన్న పిల్లల స్కూళ్లు, యువత అధికంగా సంచరించే సెంటర్లపై దృష్టి పెట్టి ఎక్కువ మందిని చంపేందుకు కుట్రలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ మందిని బందీలుగా చేసుకునేందుకు పన్నాగం రచించినట్లు స్కై న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టారు.

ఇప్పటి వరకూ యుద్దానికి వెళ్లిన సైనికులు, తమ దేశ పౌరులు అందరూ కలిపి 1400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరో 212 మందిని హమాస్ బందీలుగా చేసుకున్నట్లు తెలిపారు. అందుకే హమాస్ ఆధ్వర్యంలోని గాజాపై దాడులు కొనసాగిస్తున్నట్లు వివరించారు.

T.V.SRIKAR