Bed Bugs In France : నల్లులతో నలిగిపోతున్న పారిస్ వాసులు.. ఒలంపిక్స్ కి వేదిక కానున్న తరుణంలో నివారణ చర్యలు

ఫ్రాన్స్ ఈ పేరు చెప్పగానే అందమైన పర్యటక దేశం అంటారు అక్కడకు వెళ్లి వచ్చిన టూరిస్టులు. అయితే రానున్న రోజుల్లో ఒలంపిక్ క్రీడలకు వేదికగా నిలువనుంది పారిస్. ఇలాంటి తరుణంలో ఆ నగర వ్యాప్తంగా నల్లుల బెడద తీవ్ర ఇబ్బందిగా మారింది.

  • Written By:
  • Publish Date - September 30, 2023 / 05:20 PM IST

ఫ్రాన్స్ దేశంలో మన్నటి వరకూ ఒక యువకుడిని కారు యాక్సిడెంట్ ఘటన మారణ హోమాన్ని సృష్టించింది. దీని నుంచి కోలుకునే లోపే మరో తీవ్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదే నల్లుల బెడద. నల్లులే కదా అని లైట్ గా తీసుకుంటే తప్పదు భారీ మూల్యం. ఇది ఏదో సినిమా డైలాగ్ లాగా ఉన్నప్పటికీ దీని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. కంటికి కనిపించనంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటూ కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు. ఆఫీసు కుర్చీల్లో మొదలు ప్రజారవాణా వరకూ అన్నింటా ఇవే విస్తరించి ఉన్నాయి. దీంతో పర్యాటకులు హోటళ్లలో విశ్రాంతి తీసుకోవాలంటే బెంబేలెత్తి పోతున్నారు. దీని ప్రభావం సామాన్యులపై కూడా పడింది.

ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి..

ప్రతి ఒక్కరి ఇంట్లో విస్తరించి నిద్ర లేకుండా చేస్తున్నాయి. వినోదానికి సినిమా హాళ్లకి వెళితే అక్కడ కూడా కుట్టి కుట్టి చంపుతున్నాయి. దీంతో పారిస్ లో ఎవరూ సురక్షితంగా, సంతోషంగా లేరని ప్యారిస్ డిప్యూటీ మేయర్ అన్నారు. రానున్న రోజుల్లో నల్లుల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూడు సంవత్సరాల క్రితమే ఫ్రాన్స్ ప్రభుత్వం నల్లులపై యుద్దాన్ని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను రూపొందించింది. ఇందులో ఎమర్జెన్సీ నంబర్ కూడా ఏర్పాటు చేసింది. అనేక కీటకాలను నాశనం చేయడం కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నప్పటికీ ఈ నల్లుల బెడద తీవ్రంగా మారిందంటున్నారు అక్కడి అధికారులు.

నల్లుల నివారణకు ప్రత్యేక చర్చలు..

వీటి విస్తృతి రోజు రోజుకు పెంచుకుంటూ పోయాయి. మెట్రోలు, సిటీ బస్సులు, రైళ్లు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు అన్నింటా ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఏం చేయాలోల పాలుపోని అయోమయ స్థితిలో నగర వాసులు జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతులు, కాళ్లు, మొఖం తీవ్రమైన దద్దుతలో వికారంగా తయారవుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీటి కట్టడి కోసం ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను రచించింది. ప్రజా రవాణా అధికారులతో, ప్రతినిధులతో చర్చలకు సిద్దమైంది. నల్లి పురుగుల నిర్మూలనకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి క్లెమెంట్ బ్యూన్ తెలిపారు. రోజుకు 36లక్షల మంది ప్రయాణీకులు వస్తూ పోతూ ఉంటారని ఈ క్రమంలో వీటి వృద్ది పెరిగినట్లు తెలిపారు.

T.V.SRIKAR