Women’s Day : దేశ మహిళ దినోత్సవ కానుక.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గించిన ప్రధాని మోదీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ మహిళలకు శుభవార్త చెప్పారు. నేడు మహిళ దినోత్సవం (Women's Day) సందర్భంగా మహిళలపై ఆర్థిక భారం తగ్గించేరుకు ఓ కిలన నిర్ణయం తీసుకున్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గించింది. దీనిని స్వయంగా ప్రదాని మోదీ ట్విటర్ వేదికగా ఈవిషయాన్ని చెప్పుకోచ్చారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ మహిళలకు శుభవార్త చెప్పారు. నేడు మహిళ దినోత్సవం (Women’s Day) సందర్భంగా మహిళలపై ఆర్థిక భారం తగ్గించేరుకు ఓ కిలన నిర్ణయం తీసుకున్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గించింది. దీనిని స్వయంగా ప్రదాని మోదీ ట్విటర్ వేదికగా ఈవిషయాన్ని చెప్పుకోచ్చారు. ఇది దేశ వ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది అంటూ రాసుకోచ్చారు. శుక్రవారం మహిళ దినోత్సవం రోజు కూడా కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాము మహిళ సాధికారతకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. అందుకే వంట గ్యాస్ సిలిండర్ (Cooking Gas Cylinder) పై రూ.100 తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

మార్చి 7న జరిగిన కేబినెట్ లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) సబ్సిడీని దాని లబ్ధిదారులకు మార్చి 2025 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి 14.2 కిలోల LPG సిలిండర్ పై 300 రూపాయల సబ్సిడీ కొనసాగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (Pradhan Mantri Ujwala Yojana) కింద పేద కుటుంబాలకు అందించే వంటగ్యాస్ సబ్సిడీని 14.2 కిలోల సిలిండర్ కు కేంద్రం 2023 అక్టోబర్ లో 300కి పెంచిన సంగతి తెలిసిందే.