నేడు తెలంగానలో ప్రధాని మోదీ రెండు రోజులు.. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10.20 మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి ఆదిలాబాద్ కు ప్రధాని హెలికాప్టర్ లో రానున్నారు. ఆదిలాబాద్ 6,697 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు.. ప్రారంబోత్సవాలు చేసి జాతికి అకింత చేయనున్నారు. ఇక ప్రధాని మోదీకి అధికారికంగా ప్రోటో కాల్ ప్రకారం తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పార్టీ బహిరంగలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గనా ప్రధాని స్టేడియానికి చేరుకుని పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకలు.. బండి సంజయ్, ఈటల రాజేందర్ర, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు ప్రధాని సభలో పాల్గొననున్నారు.
తెలంగాణలో బహిరంగ సభ అనంతరం నాందేడ్ చేరుకొని అక్కడ నుంచి చెన్నై వెళ్తారు. చెన్నైలో అధికారిక కార్యక్రమాలు ముగించుకొని రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకొని రాజ్ భవన్ లో బస చేస్తారు. మంగళవారం రేపు (5వ తేదీ) సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి ప్రధాని మోదీ సంగారెడ్డి కి బయలుదేరుతారు. 10. 45 నుండి 11.15 వరకు 9,021 కోట్ల రూపాయలతో సంగారెడ్డిలో ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవాలు.. వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 11.30 నుండి 12.45 వరకు బీజేపీ బహిరంగ సభలో ప్రసంగం. తెలంగాణలో పర్యటన అనంతరం ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్ చేరుకోని అక్కడ సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. ఎయిర్ పోర్ట్ నుండి మోదీ నేరుగా ఒడీశాకు బయలుదేరుతారు.
ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ టైమింగ్స్..
4వ తేదీ షెడ్యూల్:
5వ తేదీ షెడ్యూల్:
తెలంగాణ పర్యటనలో జాతికి అంకితం చేయనున్న కార్యక్రామలు..