Priyanka : యశస్విని కోసం రంగంలోకి దిగిన ప్రియాంక.. ఎర్రబెల్లి కేడర్లో వణుకు..

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Elections) పాలకుర్తి (Palakurti) నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Errabelli Dayakar Rao) కు వ్యతిరేకంగా.. కాంగ్రెస్‌ తరఫున యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Elections) పాలకుర్తి (Palakurti) నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Errabelli Dayakar Rao) కు వ్యతిరేకంగా.. కాంగ్రెస్‌ తరఫున యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నారు. కేవలం 26 ఏళ్ల వయసులో మంత్రి దయాకర్‌ రావుతో పోటీ పడుతున్నారు యశస్విని రెడ్డి. దీంతో రాష్ట్రం మొత్తం ఇప్పుడు పాలకుర్తి వైపు చూస్తుంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ మీద వ్యతిరేక రావడం.. క్రమంగా కాంగ్రెస్‌ (Congress) బలపడుతున్న నేపథ్యంలో.. తెలంగాణలో జెండా పాతేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్ర నేతలు తెలంగాణలో పర్యటించారు. ఇప్పుడు యశస్విని రెడ్డి కి మద్దతుగా ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇవాళ తెలంగాణకు రానున్న ప్రియాంక గాంధీ పాలకుర్తిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. యశస్విని రెడ్డి ప్రచారం ముగిసిన తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ప్రియాంక పర్యటించబోతున్నారు. అక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోతో పాటు.. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించబోతున్నారు. దీనికి సంబధించిన రూట్‌మ్యాప్‌. షెడ్యూల్‌ను కూడా కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే సిద్ధం చేసింది. ఇక ప్రియాంకతో పాటు రాహుల్‌ గాంధీ కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇప్పటికే పలుమార్లు తెలంగాణకు వచ్చి ఇక్కడి అభ్యర్థులకు ప్రచారం చేసిన రాహుల్‌.. ఇప్పుడు మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. వరుసగా అగ్రనేతల రాకతో కాంగ్రెస్‌ కేడర్‌లో కొత్త జోష్‌ నెలకొంది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్‌ రావడం.. రీసెంట్‌గా వస్తున్న సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటంతో.. తెలంగాణలో జెండా పాతడమే లక్ష్యంగా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. మరో వారంలో తెలంగాణలో పోలింగ్‌ జరగబోతోంది. మరి ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడతారా హ్యాండ్‌ ఇస్తారా చూడాలి.