Priyanka Gandhi: ధరణి పోర్టల్‌తో బీఆర్ఎస్ నేతలు భూములు లాగేసుకుంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంకా గాంధీ.. మంగళవారం జహీరాబాద్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేశారు. “కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యువతకి ఉద్యోగాలు వచ్చాయా..? పరీక్షలు పెడతారు. కానీ, పేపర్లు లీక్ చేస్తారు.
ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికలపై దేశమంతా కాయ్ రాజా కాయ్.. భారీ బెట్టింగ్..!
కేసీఆర్ ఫాం హౌజ్ నుంచి పాలన కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది. ధరణి పోర్టల్‌తో భూములు లాగేసుకుంటున్నారు. ఇలాంటి అవినీతి సర్కార్ మనకు అవసరమా..? తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ సర్కారుకు గుడ్ బై చెప్పాలి. బీఆర్ఎస్‌పై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలు త్యాగం చేశారు. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్.. రెండు పార్టీలూ ఒక్కటే.
ఇవి రెండూ.. ధనవంతుల పార్టీలు. ఈ పదేళ్లలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకున్నారు. బీజేపీ.. అదానీ, అంబానీలకు కొమ్ము కాస్తుంది” అని ప్రియాంకా గాంధీ విమర్శించారు.