తెలంగాణలో గెలుపు లక్ష్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇవాళ.. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గోన్నారు. ఖమ్మం, పాలేరు, నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
REVANTH REDDY : మా పోటీ ఐటీ, ఈడీతోనే…. కాంగ్రెస్, బీజీపీతో కాదు: రేవంత్ రెడ్డి
నిరుద్యోగులకు 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఉద్యోగాలు కావాలనుకునే నిరుద్యోగులు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపండి. కొలువులు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. తెలంగాణ ఇచ్చింది కేసీఆర్, కేసీఆర్ కుటుంబం బాగు కోసం కాదు. రైతులు, ఆడబిడ్డలు, యువత, విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీ కలలను నిజం చేయలేదు. పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులను భర్తీ చేశాయి. ప్రజల సంపదను ప్రజలకు పంచాయి. యువతకు కొలువులు, అందరికీ ఇండ్లు, మహిళలకు ఆర్థిక స్వాలంబన అందించే పథకాలు, రైతులకు రుణమాఫీ చేసే ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎన్నుకోవాలి. తెలంగాణలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రజల సంపద ప్రజలకు అందుతుంది. తెలంగాణలో మార్పు రావాలి. కాంగ్రెస్ కావాలి. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క, మల్లు, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి.