Rahul Gandhi: రాహుల్, ప్రియాంక ఆ నియోజకవర్గాల నుంచే లోక్ సభకు పోటీ !

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీని రాయ్ బరేలీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఆమె ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి పోటీకి దిగుతారని గతంలో వార్తలు హల్చల్ చేశాయి.

  • Written By:
  • Updated On - March 6, 2024 / 05:25 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తేలిపోయింది. ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని అడుగుతోంది స్థానిక కాంగ్రెస్ నాయకత్వం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీని రాయ్ బరేలీ నుంచి ప్రారంభించబోతున్నారు.

Bengaluru water crisis: మా ఇంట్లో నీళ్ళు రావట్లేదు.. డిప్యూటీ సీఎం గగ్గోలు !

ఆమె ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి పోటీకి దిగుతారని గతంలో వార్తలు హల్చల్ చేశాయి. కానీ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికవడంతో.. ఆ స్థానంలో ప్రియాంక పోటీకి దిగబోతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ.. అమేథీ నుంచే తిరిగి బరిలో నిలబడతారు. ఈసారి కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019లో రాహుల్ గాంధీ అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఈసారి తెలంగాణలోని ఖమ్మం లేదా భువనగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్‌కి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. కానీ ఇద్దరూ ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచే పోటీకి సిద్ధమవుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాయ్ బరేలీ నియోజకవర్గం ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఇందిర.. ఇక్కడి నుంచి 3 సార్లు, సోనియా ఐదుసార్లు గెలుపొందారు.

ఆరోగ్యరీత్యా సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడంలేదు. ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో రాయ్ బరేలీలో ప్రియాంక నిలబడుతున్నారు. ఆమెకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా భారీగా వెలిశాయి. రాయ్ బరేలీలో బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. 2019లో సోనియా మీద ఓడిపోయిన దినేష్ ప్రతాప్ సింగ్‌నే బీజేపీ.. మళ్ళీ దించే అవకాశాలున్నాయి. ఇక రాహుల్‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్ళీ పోటీకి దిగుతారని తెలుస్తోంది.