తెలంగాణ ఎన్నికలకు ఇంకా ఎన్నో రోజులు లేదు.. ప్రధాన పార్టీలు అన్ని కూడా ఎన్నికల ప్రచారంలో ఓట్లు రబట్టుకునేందుకు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఎన్నికలకు మరో వారం రోజులే ఉండడంతో ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలో విస్తృత పర్యటన చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక జాతీయ పార్టీలు అయితే ఏకంగా జాతీయ నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపుతున్నాయి. తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాందీ పర్యటించనున్నారు. ఈరోజు, రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈరోజు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని.. మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని.. అనంతరం 1:30 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ, సాయంత్రం 3:00 గంటలకు కొత్తగూడెంలో నిర్వహించే ర్యాలీలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు.
Telugu states, High Alert : తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించాలని కోరుతూ ప్రియాంక గాంధీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా రోడ్, ప్రజాభేరి సభలో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ ఈరోజు రాత్రికి ఖమ్మం లోనే బస చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పాలేరు నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తారు. 25న పాలేరు, ఖమ్మం, వైరా, మదీరా నాలుగు నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు.
ఉదయం పదకొండు గంటలకు పాలేరు వెళతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గంలోనూ ఆ తర్వాత మధిర నియోజకవర్గంలో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధిర పర్యటన తర్వాత నేరుగా విజయవాడ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.