IAS PUJA : ఆ IASపై క్రిమినల్ కేసు.. మళ్ళీ ఎగ్జామ్స్ రాయకుండా డిబార్

ప్రొబేషనరీ IAS ఆఫీసర్ పూజా ఖేద్కర్ పై UPSC నిషేధం విధించింది. తప్పుడు పత్రాలతో సివిల్స్ ఎగ్జామ్స్ రాసిన ఆమెపై కేసు నమోదు చేసింది. ఇక నుంచి ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది.

 

 

ప్రొబేషనరీ IAS ఆఫీసర్ పూజా ఖేద్కర్ పై UPSC నిషేధం విధించింది. తప్పుడు పత్రాలతో సివిల్స్ ఎగ్జామ్స్ రాసిన ఆమెపై కేసు నమోదు చేసింది. ఇక నుంచి ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ IAS ఆఫీసర్ పూజా ఖేద్కర్ ఓవరాక్షనే ఇందుక్కారణం. ఇంకా పూర్తిగా సర్వీసులోకి రాకుండా పుణెలో ట్రైనింగ్ లో ఉండగానే… అత్యంత ఖరీదైన ఆడీ కారు కోసం డిమాండ్ చేసింది పూజ. రూల్స్ కి విరుద్ధంగా దానికి రెడ్ సిగ్నల్ బల్బ్స్ కూడా పెట్టించుకుంది. అంతే కాకుండా… తనకు ప్రత్యేక ఛాంబర్ కావాలనీ… కానిస్టేబుల్, బంట్రోతులు, సిబ్బంది…ఇలా చాలా గొంతెమ్మ కోరికలు కోరింది.

ఇది ఉన్నతాధికారులకు చేరడంతో పూజను వేరే జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేశారు. PMO అధికారులు వివరణ కూడా కోరారు. ఈ లోగా…ఆమె సివిల్స్ పరీక్షలు రాయడానికి ఫోర్జరీ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినట్టు ఆరోపణలు రావడంతో…UPSC ఎంక్వైరీ చేసింది. అమ్మగారి బండారం మొత్తం బయటపడింది. తల్లి దండ్రుల పేర్లు, ఫోటోగ్రాఫ్, సైన్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్… అడ్రస్ ఇలా అన్నీ మానిప్యులేట్ చేసినట్టు UPSC తనిఖీల్లో బయటపడింది. దాంతో పూజా ఖేద్కర్ పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ సహా అనేక చర్యలు చేపట్టింది UPSC. ఆమెపై FIR నమోదు చేయాలని పోలీసులను కోరింది. ఇక భవిష్యత్తులో పూజ UPSC పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది.

పూజా ఖేద్కర్ కుటుంబంపైనా అనేక ఆరోపణలు వచ్చాయి. ఆమె తల్లి మనోరమా ఖేద్కర్ … రైతుల భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించింది. నాకు అడ్డు చెబుతారా… రివాలర్వర్ తో వాళ్ళని బెదిరించడం వివాదస్పదమైంది. వీడియోలు బయటకు రావడంతో ఆమెను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి… జైలుకు తరలించారు. ప్రస్తుతం పూజ తల్లి కట కటాలు లెక్కపెడుతోంది. పూజ తండ్రి దిలీప్ ఖేద్కర్… మహారాష్ట్ర గవర్నమెంట్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు.

గతంలో అవినీతి ఆరోపణలతో రెండు సార్లు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయినట్టు బయటపడింది. దిలీప్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కావడంతో… ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ACBకి కంప్లయింట్స్ అందాయి. మొత్తానికి ఓవరాక్షన్ చేసిన పూజాయే కాదు… ఫ్యామిలీ అంతా ఇరుకున పడింది. తల్లి జైలుకు వెళ్ళగా… పూజతో పాటు ఆమె తండ్రి కూడా ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.