America: తానా సభల్లో గందరగోళం.. చొక్కా పట్టుకొని తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు..

అమెరికా ఈపేరు చెప్పగానే ప్రపంచ దేశాల్లో అత్యంత ధనిక దేశంగా చెప్పుకుంటారు. అంతే కాకుండా సాంకేతిక పరంగా మనతో పోలిస్తే చాలా సంవత్సరాలు ముందు ఉన్నారని చెప్పాలి. అలాంటి అమెరికాలో మన తెలుగోడు జండా ఎగురవేస్తూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం మన జాతిని, గౌరవాన్ని, సంప్రదాయాలను అక్కడి ప్రజలకు చూపిస్తూ మన కీర్తిని ప్రతిబింబేలా చేస్తుంది. అలాంటి తెలుగువాళ్లు ఇప్పుడు మన పరువును బజారుకు ఈడుస్తున్నారని చెప్పక తప్పదు. అసలు ఏం జరిగిందో ఇప్పడు చూద్దాం. దీనిపై ప్రముఖ నిర్మాత ఏమని స్పందించారో తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - July 9, 2023 / 06:15 PM IST

తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని అర్ధం. అమెరికాలోని ఉత్తర అమెరిగా తెలుగు సంఘంలోని సభలో తెలుగు తమ్ముళ్లు కొడ్లాడుకున్నారు. ఇంకో అడుగు ముందుకు వేసి తన్నుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.చివరికి ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకొని తన్నుకున్నారు. గతంలో రెండుగా చీలిపోయిన తెలుగు దేశం పార్టీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం చూస్తుండగానే ఒకరిని ఒకరు కొట్టుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన మొత్తం వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో చూసిన కమెడియన్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దీనిపై తనదైన స్టైల్ లో స్పందించారు. టీడీపీ సీనియర్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. ‘తానా పరువు తీస్తున్నారు కదా దాన్ని నిర్మించడానికి ఎంతో మంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా.. సిగ్గులేదా మీకు జీవితంలో బుద్దిరాదు మీ బతుకులు చెడ’ అంటూ తనలోని ఆవేదనను కోపం రూపంలో వ్యక్తం చేశారు.

T.V.SRIKAR