ప్రస్తుతం కోవిడ్ ప్రభావం ప్రపంచ దేశాల్లో ఎక్కడా అంతగా కనిపించడం లేదు. దీంతో దిగ్గజ కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోమ్ కి స్వస్తి పలుకుతున్నాయి. ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచిస్తున్నాయి. లేని పక్షంలో పనికి రిజైన్ చేయాలని చెబుతున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులలో కొంత గందరగోళం ఏర్పడింది. కొందరు ఉద్యోగులైతే పని వదులుకునేందుకు కూడా సిద్దపడుతున్నారు. వీరి కోసం ఒక ప్రత్యేకేమైన పద్దతికి శ్రీకారం చుట్టారు కొందరు ఐటీ నిపుణులు.
ఇన్నాళ్ళూ ఇంటి నుంచి పనిచేసి ఉన్నపళంగా ఆఫీసులకు రావాలని సూచించడంతో కొందరు ఐటీ ఉద్యోగుల్లో కొంత ఇబ్బంది ఏర్పడింది. దీనిని పరిష్కరించేందుకు వర్క్ ఫ్లెక్సిబిలిటీ ని కోరుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా హైబ్రీడ్, వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని తీసుకురావాలని సూచిస్తున్నారు.
హైబ్రీడ్ పద్దతి అంటే..
ఉద్యోగికి అవసరమైనప్పుడు మాత్రమే ఆఫీసుకు వచ్చి.. మిగిలిన రోజులు ఇంటి నుంచే పనిచేసేలా కొత్త ప్రణాళికలను తీసుకురావాలని కోరుకుంటున్నారు. దీంతో ఆఫీసుకి వచ్చినట్లు ఉంటుంది. ఇంట్లో పనిచేసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. దీనిని రోజు మార్చి రోజు ఆఫీసుకు వచ్చేలా ఒక పద్దతి. వారంలో మూడు రోజులు ఆఫీసులో.. రెండు రోజులు ఇంటి నుంచి పనిచేసేలా మరో కొత్త విధానాన్ని ప్రవేశపట్టాలని భావిస్తున్నారు. ఎందుకిలా అడుగుతున్నారంటే.. వారంలో ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన రెండు రోజులు వారాంతపు సెలవులు వస్తాయి. అందుకే మొదటి మూడు రోజులు ఆఫీసుకు వెళ్తే మిగిలిన నాలుగు రోజులు ఇంట్లోనే ఉన్న భావన కలుతుంది. పైగా ఈ నాలుగు రోజుల్లో కూడా రెండు రోజులు పనిచేస్తారు. దీంతో పనిలో ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది అని అంటున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్..
ఐటీ ఉద్యోగుల అందరూ పూర్తిస్థాయిలో ఇంటి నుంచే తమ పనిని చేసుకునేలా ఆదేశాలు జారీచేయడాన్నే వర్క్ ఫ్రం హోమ్ అంటారు. దీనిని కంపెనీలే స్వయంగా ఉద్యోగులకు ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులు కంపెనీలను అడగడం ఉండదు. ఇది కోవిడ్ రాకముందు నుంచే కొన్ని కంపెనీల్లో అమలులో ఉండేది. కరోనా కారణంగా అందరికీ ఈ సౌకర్యాన్ని కల్పించడంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి బాగా అలవాటు పడిపోయారు.
ఫ్లెక్సిబిలిటీ హవర్స్ అంటే..
ఇప్పటి వరకూ లేని కొత్త విధానం ఇది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పని ఉంటుంది. అందులో మనకు ఉద్యోగంలో ఉన్న సమయంలోనే కొన్ని అత్యవసర పనులు వచ్చి పడుతూ ఉంటాయి. దీనికి ఈ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా దోహదపడుతుంది. ఇలా మనకు ఖాళీ దొరికిన సమయంలో ఆఫీసు పని చేసుకొని ఆతరువాత బయట పని చూసుకోవచ్చు. అయితే ఈ విధానంలో కొన్ని ప్రత్యేకమైన రూల్స్ తీసుకొని వస్తున్నారు.
ఈ విధానాలు ఎందుకు తెస్తున్నారు..
తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం వివిధ రంగాలలో పనిచేస్తున్న 3800 మందిని శాంపిల్ గా తీసుకున్నారు. వీరిలో 76 శాతం మంది హైబ్రీడ్ లేదా వర్క్ ఫ్రం హోమ్ ను ఇష్టపడుతున్నట్లు తెలుస్తొంది. అయితే కొన్ని సంస్థలు తప్పని సరిగా ఆఫీసులకు రావాలనే నిబంధనను తీసుకువచ్చారు. అయితే కేవలం 35 శాతం మంది మాత్రమే మొగ్గుచూపుతున్నట్లు నివేదిక సారాంశం. తాజాగా జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్ మన్ సాచ్స్, మోటా, టీసీఎస్ కంపెనీలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీనిపై కొందరు ఐటీ నిపుణులు, మనసిక వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇన్నేళ్లుగా అలవాటు పడిన వారికి ఒక్కసారిగా తమ విధానాలు మార్చుకోవాలంటే కాస్త సమయం పడుతుంది అంటున్నారు. అందుకే ఉద్యోగులకు, కంపెనీలకు సామరస్యంగా ఉండేలా హైబ్రీడ్ విధానాన్ని లేదా ఫ్లెక్సిబిలిటీని తీసుకురావాలని సూచిస్తాన్నాయి.
T.V.SRIKAR