మినీ ఆస్ట్రేలియాగా పంజాబ్, కౌంటర్ ఇచ్చిన పాంటింగ్

ఐపీఎల్ మెగావేలంలో పంజాబ్ కింగ్స్ ఈ సారి పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది. తమ ప్లానింగ్ కు అనుగుణంగానే పలువురు స్టార్ ప్లేయర్స్ ను దక్కించుకుంది. నిజానికి రిటెన్షన్ లోనూ పంజాబ్ ప్లానింగ్ అదిరింది. కేవలం ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్ కింగ్స్ 110.5 కోట్ల రూపాయలతో వేలానికి వచ్చింది.

  • Written By:
  • Publish Date - November 30, 2024 / 01:40 PM IST

ఐపీఎల్ మెగావేలంలో పంజాబ్ కింగ్స్ ఈ సారి పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది. తమ ప్లానింగ్ కు అనుగుణంగానే పలువురు స్టార్ ప్లేయర్స్ ను దక్కించుకుంది. నిజానికి రిటెన్షన్ లోనూ పంజాబ్ ప్లానింగ్ అదిరింది. కేవలం ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్ కింగ్స్ 110.5 కోట్ల రూపాయలతో వేలానికి వచ్చింది. అర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ ను ఆరంభంలోనే రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా 18 కోట్లకు తీసుకున్న పంజాబ్ తర్వాత కూడా పలువురు స్టార్ ప్లేయర్స్ ను దక్కించుకుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లను తీసుకుంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కు హెడ్ కోచ్ గా ఉంటున్న రికీ పాంటింగ్ దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ గా ఉన్న పాంటింగ్ ను ఆ జట్టు వదిలేసుకుంది. దీంతో ఈ ఆసీస్ దిగ్గజం పంజాబ్ తో జత కట్టాడు.

మెగా ఆక్షన్ లో పాంటింగ్ తీరుపై విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియా కావడంతోనే అతను కావాలని తమ దేశం ప్లేయర్లను తీసుకున్నాడని నెటిజన్స్ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు పాంటింగ్ కౌంటర్ ఇచ్చాడు. తాము ఎందుకు ఆసీస్ క్రికెటరలను తీసుకోవాల్సి వచ్చిందో వెల్లడించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎక్కువగా ఉండడంతో విమర్శలు రావడం సహజమేనన్నాడు. 8 మంది ఓవర్సీస్‌ ఆటగాళ్లలో ఐదుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లను తీసుకున్నామని చెప్పాడు. జట్టు వ్యూహంలో భాగంగానే వారిని తీసుకున్నట్టు పాంటింగ్ చెప్పాడు. ఆయా పాత్రలకు ఎవరు సరిపోతారో చూసే తీసుకున్నామని తెలిపాడు.

స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లు కింగ్స్‌కు తిరిగి రావడం సంతోషంగా ఉందన్న పాంటింగ్ వారి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందన్నాడు. బార్ట్‌లెట్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్‌తో సహా ఇద్దరు కొత్త కుర్రాళ్ళు మొదటిసారిగా ఐపీఎల్ ఆడబోతున్నారని చెప్పాడు. అయితే పాంటింగ్ తన దేశానికి చెందిన టాలెంటెడ్ ప్లేయర్స్ ను ఎంపిక చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఢిల్లీకి కోచ్ గా ఉన్నప్పుడు జేక్ ఫ్రేజర్ ను ఆ టీమ్ లోకి తీసుకున్నాడు.