Pushpa 2: పుష్ప ఫీవర్.. ‘పుష్ప 2’ మామూలుగా ఉండదట

పుష్ప పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా కూడా సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2 హైప్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సుకుమార్.. ఈసారి పుష్పరాజ్ వేట మామూలుగా ఉండదని చెప్పేశాడు. ఇక ఇప్పుడు అంతకుమించి అంటూ.. హైప్‌తోనే ఫ్యాన్స్ పోయేలా చేస్తున్నాడు సుకుమార్.

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 02:02 PM IST

Pushpa 2: 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప పార్ట్ 1 ఊహించని విధంగా బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీలో అదిరిపోయే హిట్ అందుకుంది. అందుకే.. పుష్ప పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా కూడా సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2 హైప్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సుకుమార్.. ఈసారి పుష్పరాజ్ వేట మామూలుగా ఉండదని చెప్పేశాడు.

CHIRANJEEVI VS BALAKRISHNA: బాలయ్య రేంజ్.. చిరంజీవిని మించిపోతుందా..?

ఇక ఇప్పుడు అంతకుమించి అంటూ.. హైప్‌తోనే ఫ్యాన్స్ పోయేలా చేస్తున్నాడు సుకుమార్. ఆగష్టు 15న రానున్న పుష్ప 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న బన్నీ అభిమానులకు.. మరింత హైప్ పెంచుతున్నాడు సుక్కు. తాజాగా ఓ ఇంటర్య్వూలో.. పుష్ప 2 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు సుకుమార్. అభిమానులకు ప్రామిస్ చేస్తున్నా.. పుష్ప పార్ట్ 1 కంటే పుష్ప పార్ట్ 2 అంతకు మించి ఉంటుందని చెప్పి మరింత కిక్ ఇచ్చాడు లెక్కల మాస్టర్. ముఖ్యంగా పార్ట్ 2 సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వచ్చిందని అన్నారు. అలాగే భన్వర్ సింగ్ షెకావత్, పుష్పరాజ్ మధ్య జరిగే యాక్షన్ మామూలుగా ఉండదని.. ఎమోషనల్ సీన్స్ కూడా అదిరిపోతాయని చెప్పుకొచ్చాడు.

అలాగే.. పుష్పరాజ్‌కి ఎదురయ్యే సమస్యలు.. వాటిని ఎదుర్కొన్న తీరు చాలా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు. ఖచ్చితంగా పార్ట్ 2 ప్రేక్షకుల అంచాలను మించి ఉంటుందని.. తెలిపాడు. దీంతో రోజు రోజుకి పుష్ప2 పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మరి ఈసారి పుష్పరాజ్ చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.