పుష్ప (Pushpa) సినిమా మొదటి పార్ట్ విడుదలై మూడేళ్ళు కావొస్తుంది. మరో రెండో భాగం ఎప్పుడు విడుదల చేస్తారు…? అల్లు అర్జున్ (Allu Arjun) యూరప్ (Europe) నుంచి ఎప్పుడు వస్తారు…? సుకుమార్ అమెరికా వెళ్లి ఎప్పుడు వస్తున్నారు…? రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) లో రెండు నెలల క్రితం వేసిన సెట్ సంగతి ఏంటీ…? ఇప్పుడు ఈ ప్రశ్నలు సోషల్ మీడియా (Social Media) లో పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. ఇక ఈ సినిమాపై రూమర్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమా మీద అంత ఆసక్తి చూపించడం లేదని అందుకే దర్శకుడు కూడా అంత సీరియస్ గా ఉండటం లేదంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో నిర్మాతలు చాలా సీరియస్ గా ఉన్నారట. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఖర్చు చేసారు. బాహుబలి (Baahubali) పార్ట్ 2 నే రెండేళ్ళలో విడుదల అయితే ఈ సినిమా ఇంకెన్నేళ్ళు పడుతుంది అంటూ దర్శకుడిపై సీరియస్ గా ఉన్నారట. ఇక ప్రతీ సీన్ తనకు నచ్చితేనే ఓకే చేసుకుంటాను అని ఎలా పడితే అలా హడావుడిగా తీసేది లేదని సుకుమార్ గట్టిగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా ఫాస్ట్ గా పూర్తి చేస్తే వేరే ప్రాజెక్ట్ లు మొదలుపెడతా అంటూ చెప్తున్నాడట.
రెండు నెలల నుంచి సినిమా షూటింగ్ పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక సినిమా విలన్ ఫాహాద్ ఫాజిల్ కు ఆరోగ్య సమస్యలు ఉండటం తో సినిమా ఆలస్యమవుతుందని ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అల్లు అర్జున్ ఇప్పటికే యూరప్ నుంచి తిరిగి వచ్చి సినిమా షూటింగ్ కు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ కొన్ని సన్నివేశాల వల్లనే తొందర పడలేకపోతున్నాడు అని సినీ వర్గాలు అంటున్నాయి. మరో వారం రోజుల్లో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉండవచ్చని, ఒక పాట చిత్రీకరణ చివరి దశలో ఉందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి.