రఫ్ఫాడించిన రబాడ బంగ్లాపై సఫారీల విక్టరీ

బంగ్లాదేశ్ టూర్ ను దక్షిణాఫ్రికా ఘనవిజయంతో ఆరంభించింది. ఢాకా టెస్టులో 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పోరాడింది. 307 రన్స్ కు ఆలౌటైంది.

  • Written By:
  • Publish Date - October 24, 2024 / 08:40 PM IST

బంగ్లాదేశ్ టూర్ ను దక్షిణాఫ్రికా ఘనవిజయంతో ఆరంభించింది. ఢాకా టెస్టులో 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పోరాడింది. 307 రన్స్ కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించిన సౌతాఫ్రికా విజయం కోసం 106 పరుగుల టార్గెట్ ను 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సౌతాఫ్రికా స్టార్ పేసర్‌ రబాడ మ్యాచ్‌ మొత్తంలొ 9 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్ లో సఫారీ ఆటగాడు కైల్‌ వెర్రిన్‌ తొలి ఇన్నింగ్స్‌లో సూపర్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దాదాపుగా దశాబ్దం తర్వాత ఆసియాలో సౌతాఫ్రికా టెస్టు గెలుపు రుచి చూసింది. అంతకుముందు 2014లో గాలె వేదికగా శ్రీలంకపై సఫారీ టీమ్ గెలిచింది.