Raghu Rama Krishna Raju: వైసీపీ రెబల్ నేతగా పేరున్న ఎంపీ రఘురామ కృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) పోటీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆయనకు టీడీపీ టిక్కెట్ కేటాయించింది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రఘురామ బరిలో దిగనున్నారు. రఘురామ శుక్రవారమే టీడీపీలో చేరారు. ఉండి టిక్కెట్‌ను ఇంతకుముందు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు. తాజాగా ఆయనకు టిక్కెట్ క్యాన్సిల్ చేసి.. రఘురామ కృష్ణరాజుకు ఇచ్చారు.
Apple Lays Off: ఉద్యోగులకు షాకిచ్చిన యాపిల్.. భారీగా ఎంప్లాయిస్ తొలగింపు
దీంతో రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. నిజానికి రఘురామకు టీడీపీ లేదా బీజేపీలలో ఏదో ఒక పార్టీ తరఫున టిక్కెట్ దక్కొచ్చని ఆశించారు. ఆయన నరసాపురం BJP MP టిక్కెట్ ఆశించారు. అయితే, ఆయనకు నరసాపురం టిక్కెట్ దక్కలేదు. ముందుగా ప్రకటించిన లిస్టులో ఏ పార్టీ నుంచి టిక్కెట్ రాలేదు. ఎంపీ, ఎమ్మెల్యేలలో ఏ పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో రఘురామ నిరాశకు గురయ్యారు. మరోవైపు తనకు టీడీపీ అయినా టిక్కెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. వైసీపీపై, జగన్‌పై నాలుగేళ్లకు పైగా పోరాటం చేసిన తనకు టిక్కెట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు ఆయనకు టిక్కెట్ ఇవ్వాల్సిందే అనే డిమాండ్ కూడా పెరిగింది.
సోషల్ మీడియాలో చాలా మద్దతు లభించింది. దీంతో టీడీపీ పునరాలోచనలో పడింది. ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇచ్చి, రఘురామకు అండగా నిలవాలని డిసైడైంది. దీంతో అనేక సర్వేల తర్వాత ఉండి టిక్కెట్ కేటాయించింది. ఈ సందర్భంగా రఘరామ మాట్లాడుతూ.. తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.