RAHUL GANDHI: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కులగణన: రాహుల్ గాంధీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దళితులు, మైనారిటీలు, అణగారిన వర్గాలు బాగుపడతాయనుకున్నాం. కానీ, అలా జరగలేదు. కేసీఆర్ మాదిరి ఉత్తుత్తి మాటలు చెప్పం. ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం. అలాగే అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం.

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 05:46 PM IST

RAHUL GANDHI: తెలంగాణలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలుచేసి తీరుతామన్నారు. పినపాక, వరంగల్‌లో జరిగిన కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన చోట ప్రతిపైసా పేదలకే వెళ్తుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలోనే డబ్బులు జమ చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుంది. ఓ కుటుంబం కోసం తెలంగాణ ఏర్పాటు చేయలేదు.

Congress Manifesto : కాంగ్రెస్ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకే అంకితం..

తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పాటు చేశాం. కేసీఆర్ చెప్పినట్లు 24 గంటల ఉచిత విద్యుత్ వస్తోందా? కేసీఅర్ ఇంట్లో మాత్రమే విద్యుత్ ఉందేమో? ఆయన ఇంట్లో నుంచి బయటకు రారు గనుక కేసీఆర్‌కు తెలియదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దళితులు, మైనారిటీలు, అణగారిన వర్గాలు బాగుపడతాయనుకున్నాం. కానీ, అలా జరగలేదు. కేసీఆర్ మాదిరి ఉత్తుత్తి మాటలు చెప్పం. ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం. అలాగే అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం. ఏ కులాలు వెనుకబాటుకు గురయ్యాయో తెలుసుకుని, వారి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే. తెలంగాణ ఎన్నికల తర్వాత మోదీని కూకటి వేళ్ళతో పెకిలిస్తాం. తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు కొంతకాలం హడావిడి చేసి, ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు. బీఆర్ఎస్‌ను గెలిపించడానికే వాళ్లు పని చేస్తున్నారు.

లోక్‌సభలో ఈ రెండు పార్టీలు కలిసే ఉన్న విషయాన్ని గుర్తించా. అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. ఇక్కడ మరో పార్టీ ఉంది. అదే ఎంఐఎం. ఏ రాష్ట్రంలో బీజేపీతో కాంగ్రెస్ పోరాడుతుందో.. ఆ రాష్ట్రంలో ఎంఐఎం అభ్యర్తుల్ని నిలబెడుతుంది. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది” అని రాహుల్ వ్యాఖ్యానించారు.