Rahul Gandhi: విద్వేషానికి.. విలువలకు మధ్య జరిగే యుద్దాన్ని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

భారతదేశంలో రానున్నది ఎన్నికల సమయం. దీనిని మైండ్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్రస్తుత పాలకుల అవినీతిని, అహంకారాన్ని, నిరంకుశత్వాన్ని, విద్వేశాన్ని, పత్రికల, ప్రజాస్వామ్య విలువల, బ్యూరోక్రసీలను బంధించి వాటి స్వేచ్ఛ హరించడాన్ని క్లుప్తంగా వివరించింది. ఈ వీడియో నిడివి 1.43 నిమిషాల పాటూ ఉంటుంది. దీనికి రాజ్ కపూర్ పాటను జోడించి కొన్ని లిరిక్స్ ను మర్చి చిత్రీకరించారు. ఈ వీడియో పూర్తి వివరాలను ఇప్పుడు గమనిద్దాం.

  • Written By:
  • Publish Date - June 28, 2023 / 03:00 PM IST

ఈ వీడియోను పూర్తిగా యానిమేటెడ్ రూపంలో చిత్రీకరించారు. ప్రారంభంలోనే మోదీ తన గుర్రపు బండిపై మీడియా, బ్యూరోక్రసి, డెమోక్రసీని నిర్భంధించి తన రథం పై వేసుకొని వెళ్తున్నట్లు చూపిస్తారు. అలా వెళ్తున్న మార్గాన్ని నఫ్రత్ కా బజార్ అని నామకరణం చేశారు. దీని అర్థం విద్వేశాలను రెచ్చగొట్టి అక్రమాలకు పాల్పడి రాజకీయ సింహాసనాన్ని అధిరోహించే పాలకులకు సంబంధించిన వర్తక ప్రదేశంగా చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్రోహ శక్తులన్నీ ఇక్కడ అందుబాటులో దొరుకుతాయని చెప్పారు. మోదీతో పాటూ అమిత్ షాను కూడా ఈ వీడియోలో చూపించారు. హిందూ, ముస్లీంలకు మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే పాత్ర పోషించారు. ఇలా ఇరు పక్షాలు కొట్లడుకుంటున్న సమయంలో భారత్ జోడో యాత్ర కు సింబాలిక్ గా రాహూల్ అడుగులను చూపిస్తారు. అలా చూపిన తరువాత కొట్లాడుకున్న వారికి మధ్య సఖ్యత కుదిరేలా ఈ నాయకుడు నడుంబిగించాడని ఒక పాట రూపంలో చూపించారు.

ఇక మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇలా అందరినీ కలుపుకొని యాత్ర చేస్తున్న క్రమంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ఎలా నిర్వీర్యం చేశారో పత్రికల్లో ప్రచురితం అయిన వార్తలను చూపిస్తారు. అక్రమంగా కేసులు పెట్టి, తనకు ఇచ్చిన అధికార నివాసాన్ని ఎలా ఖాళీ చేయించారో తెలిపారు. మోదీ, షా లు విభజించు, పాలించు అనే గ్రంధంలోని రూల్స్ చదువుకుంటూ ఉంటారు. వీరి కుట్రలను నిలువరించడం కోసం రాహూల్ పెద్ద లారీలో వచ్చి అక్రమాలు చేసే నఫ‌్రత్ కా బజార్ అనే బోర్డ్ ను కూల్చేస్తాడు. అలా ఆ బోర్డ్ కింద పడిపోయిన వెంటనే మొహబ్బత్ కే దుకాన్ అనే షాపు కనిపిస్తుంది. మొహబ్బత్ అంటే ప్రేమా, అనురాగాలు, ఆప్యాయతలు, విలువలు అని అర్థం. ఈ ప్రాంతంలో కొన్ని వికృత శక్తులు వచ్చి ఇక్కడ లభించే ప్రేమానురాగాలను కనుమరుగు చేశాయని వాటిని తిరిగి వెలుగులోకి తీసుకొచ్చేందుకు రాహూల్ గాంధీ వచ్చాడని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తన మార్క్ క్యాంపైన్ ని మొదలు పెట్టారని చెప్పాలి.

T.V.SRIKAR