Telangana Elections : ఆదిలాబాద్ లోని బోధన్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ సభ.. బీఆర్ఎస్ పై విమర్శలు గిప్పించిన రాహుల్

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం మరింత ఊపు అందుకుంది. పోలింగ్ కు మరో 5 రోజులు మాత్రమే ఉండటంతో.. ఢిల్లీ అగ్ర నాయకత్వం మొత్తం తెలంగాణ గల్లీలో సిష్ట వేశారు. కాంగ్రెస్ లో ఒక వైపు పాలేరు, ఖమ్మం లో ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహిస్తుండగా.. మరో వైపు అగ్రనేత రాహుల్ గాంధీ బోధన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం మరింత ఊపు అందుకుంది. పోలింగ్ కు మరో 5 రోజులు మాత్రమే ఉండటంతో.. ఢిల్లీ అగ్ర నాయకత్వం మొత్తం తెలంగాణ గల్లీలో సిష్ట వేశారు. కాంగ్రెస్ లో ఒక వైపు పాలేరు, ఖమ్మం లో ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహిస్తుండగా.. మరో వైపు అగ్రనేత రాహుల్ గాంధీ బోధన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన మండవ బోధన్‌ కాంగ్రెస్‌ విజయభేరి సభలో సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నల్లచట్టాలు చేసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. ‘‘నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారు.. నాకు ప్రభుత్వ ఇంటిని తొలగించారు’’ అని అన్నారు.

Priyanka Gandhi, Road Show : ఖమ్మం, పాలేరు, లో ప్రియాంక గాంధీ రోడ్ షో..

తెలంగాణలో ప్రజాపాలన కనిపించడం లేదని.. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని.. రాష్ట్రంలో ఇసుకలో.. మైనింగ్‌లో.. ఎటు నుంచి చూసినా కేసీఆర్‌ ప్రజా ధనాన్ని దోచుకునే పనిలో ఉన్నారు. ధరణి తెలంగాణలో దొరలు మీ భూములు లాక్కుంటున్నారు. తెలంగాణ మంతత్రులందరూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. 8,000 మంది రైతులు దొరల తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలు ఆశించింది ఇలాంటి తెలంగాణ కాదు. ఎవరి భూములు వారికి ఇచ్చేదే ప్రజా తెలంగాణ. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల్ని మళ్లీ దళితుల అభివృద్ధి అని గండికొట్టారు. మీ స్వప్నాన్ని కేసీఆర్‌, మంత్రులు నాశనం చేశారు.

కాంగ్రెస్ పార్టీ మీ చేతుల్లో తెలంగాణ గ్యారెంటీ కార్డు పెట్టాం. ఇవి గ్యారెంటీలు కావు (కాంగ్రెస్‌ గ్యారెంటీ ప్రతిని చూపిస్తూ..) చట్టంగా అమలు చేయబోతున్నాం. తొలి కేబినెట్‌లోనే వీటిని చట్టాలుగా మారుస్తాం. బీఆర్‌ఎస్‌, బీజేపీ పాలనలో గ్యాస్‌ సిలిండర్‌ రూ.1200గా ఉంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సిలిండర్‌ ధర తగ్గిస్తాం. కాంగ్రెస్‌ గెలిచాక.. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం. కేసీఆర్‌ కారు పంక్చర్‌ అయ్యింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాహుల్‌ గాంధీ.