RAIN ALERT: మరాట్వాడా నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. దీంతో శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 26 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆది, సోమ.. ఈ మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
New Criminal Laws: భారతీయ న్యాయశాస్త్రంలో కొత్త చట్టాలు.. అమలు ఎప్పటినుంచంటే
ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో రాత్రి సమయాల్లో తేలికపాటి వర్షం పడొచ్చు. రాష్ట్రంలోని మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సాధారణ స్థాయిలోనే ఉంటున్నాయి. రాత్రిపూట హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రం సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
అయితే, ఈనెల 27 నుంచి తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే ఏపీలోనూ రెండు రోజుల పాటు అక్కడకక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. కానీ, పగటిపూట మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో మంచు ప్రభావం కొనసాగుతోంది.