నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) ప్రభావంతో ఈరోజు AP, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఇరురాష్ట్రాల వాతావరణ శాఖలు వెల్లడించాయి. APలో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నాయి. తిరుపతిలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8.82 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఆవహించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో అక్కడక్కడా భారీ వర్షపాతం (Heavy Rains) నమోదవుతుంది. ఇక రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్.. జిల్లాల పరిధిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించాయి. అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు తెలిపింది.
నిన్న కురిసిన ఉమ్మడి మెదక్ లో భారీ వర్షం కురిసింది. ఇక మెదక్ జిల్లాలో పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పీర్ల తండాలో పిడుగుపాటుతో పశువుల కాపరి గెమ్లా మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచ్చెరేగడిలో పొలం పనులకు వెళ్లిన గోపాల్ పిడుగు పడి చనిపోయారు. న్వాల్కల్ మండలం అత్నూర్ ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెట్టు పూర్తి దగ్ధమైంది.