Weather update : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన… ఈదురుగాలులతో వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు IMD గుడ్ న్యూస్ చెప్పింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు IMD గుడ్ న్యూస్ చెప్పింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఈనెల 17 వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో వర్షం.. ఏకాంత ప్రదేశాలలో మెరుపులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉంది. రేపు వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. HYDలో రాబోయే 48 గంటలపాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. రేపు సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఈనెల 17న ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ళతో కూడిన భారీ వర్షం పడొచ్చని హెచ్చరించింది. మెదక్, కామారెడ్డి, ములుగు, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో గంటకు నలభై, యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.