హేమ రేవ్ పార్టీ ఎపిసోడ్ తర్వాత… టాలీవుడ్ లో ఇప్పుడు రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. 11 యేళ్ళ పాటు రిలేషన్ లో ఉండి… ఇప్పుడు మరో అమ్మాయి మోజులో నన్ను వదిలేస్తావా అంటూ రాజ్ తరుణ్ పై ఆయన ప్రియురాలు లావణ్య ఆరోపిస్తోంది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆమె… పోలీసులకు సాక్ష్యాధారాలను కూడా సబ్మిట్ చేసింది. తాను గర్భం దాల్చడంతో రాజ్ తరుణ్ అబార్షన్ చేయించినట్టు లావణ్య చెబుతోంది. దీనికి సంబంధించి మెడికల్ రిపోర్టులు, 170కి పైగా ఫోటోలను ఆమె పోలీసులకు అందించింది. రాజ్ తరుణ్ తో ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న నటి మాల్వీ మల్హోత్రా, ఆమె తమ్ముడు బెదిరిస్తున్నారంటూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది.
లావణ్య ఆరోపణలు… ఆమె ఇచ్చిన సాక్ష్యాలను బట్టి రాజ్ తరుణ్ పై 420, 493, 506 సెక్షన్ల కింద పోలీస్ కేసు నమోదైంది. కేసు బలంగా మారుతుండటంతో… రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్టే అంటున్నారు. సెక్షన్ 493 ప్రకారం ఎవరైనా అబ్బాయి… ఓ అమ్మాయిని మోసం చేసి పెళ్ళి కాకుండానే భార్యగా నమ్మించి… ఆమెతో లైంగిక చర్యలో పాల్గొంటే అతనిపై ఈ రెండు అభియోగాలను మోపుతారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే 10యేళ్ళ దాకా శిక్ష పడే ఛాన్సుంది. అలాగే సెక్షన్ 420 ప్రకారం మోసం చేసినందుకు 7యేళ్ళు, సెక్షన్ 506 ప్రకారం బెదిరించినందుకు నేర తీవ్రతను బట్టి 6 నెలల నుంచి ఏడాది దాకా జైలు శిక్ష పడుతుంది.
రాజ్ తరుణ్ తో లావణ్యకు నిజంగానే పెళ్ళయిందా… పెళ్ళి అయ్యి భార్యాభర్తలుగా కాపురం చేస్తే మాత్రం కొన్ని సెక్షన్లు వర్తించవని అంటున్నారు. పెళ్ళి పేరు చెప్పి నమ్మించి మోసం చేస్తే మాత్రం రాజ్ తరుణ్ కి 10యేళ్ళ దాకా శిక్ష పడొచ్చని చెబుతున్నారు. అబార్షన్ కు సంబంధించిన సాక్ష్యాల.ను కూడా పోలీసులకు ఇచ్చింది లావణ్య. అవి నిజమని నిర్ధారణ అయితే… రాజ్ తరుణ్ పదేళ్ళు జైల్లో ఉండాల్సిందే. పోలీసులు FIR లో లావణ్య అబార్షన్ సంగతి మెన్షన్ చేయలేదు. ఆమే స్వచ్చంధంగా చేయించుకుందా… రాజ్ తరుణ్ బలవంతంగా చేయించాడా అన్నది తెలియడం లేదు. ఈ వ్యవహారంలో 314 సెక్షన్ కూడా రాజ్ తరుణ్ కి అప్లయ్ అవుతుంది.
ఈ కేసులో రాజ్ తరుణ్ ని పోలీసులు ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కోర్టునుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడా లేదంటే… పోలీస్ అధికారులతో ఇన్ ఫ్లుయెన్స్ చేయిస్తున్నాడా అన్న చర్చ నడుస్తోంది.