బాబా వంగా. జాతకాలను బాగా నమ్మేవాళ్లకు ఈ పేరు చాలా సుపరిచితం. నగరాలు దేశాలు కాదు. ఏంకంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు చాలా ఫేమస్. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కరోనా గురించి సునామీల గురించి గతంలోనే బాబా వంగా హెచ్చరికలు చేశారు. ఎగ్జాక్ట్‌గా పేర్లు చెప్పకపోయినా.. బాబా చెప్పిన ఉపద్రవాలను ప్రపంచం విట్నెస్ చేసింది. దీంతో ఆయన చెప్పే జోతిష్యానికి ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు ఉంది. అమెరికా అధ్యక్షుడి నుంచి అణుబాంబుల దాడి వరకూ ప్రతీ విషయాన్ని ఊహించి చెప్పడం బాబా వంగా ప్రత్యేకత. వరల్డ్‌వైడ్‌గా ఇంత గుర్తింపు ఉన్న బాబా వంగా కొన్ని రాశుల గురించి రీసెంట్‌గా జోతిష్యం చెప్పారు. 2025లో ఈ రాశులకు వారికి తిరుగులేదని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయన చెప్పిన ప్రడిక్షన్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బాబా చెప్పిన రాశుల్లో తమ రాశి ఉందా లేదా చెక్ చేసుకునేందుకు నెటిజన్స్ ఎగబడుతున్నారు.
బాబా వంగా ప్రిడిక్షన్ ప్రకారం 2025లో మేషరాశి వారికి రాజయోగం పట్టబోతోందట. ఈ రాశి వారు 2025లో విపరీతంగా డబ్బు సంపాదిస్తారట. ఇప్పటి వరకూ వాళ్ల జీవితంలో ఆర్థికంగా ఎదుర్కున్న సమస్యలు కనుమరుగు అవుతాయని చెప్పారు బాబా వంగా. ఈ రాశితో పాటే మిథున రాశివాళ్లు కూడా వచ్చే ఏడాది ఆర్థికంగా బలపడుతారని చెప్పారు బాబా. 2025లో మిథున రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుందట. ఆకస్మిక ధన లాభం చేకూరుతుందట. కాస్త కష్టపడితే మిథున రాశివాళ్లు 2025లోనే లైఫ్ సెటిల్ అయ్యే రేంజ్‌లో లాభపడతారని చెప్తున్నారు బాబా. ఇక వృషభ రాశి వాళ్లకు కూడా 2025 బాగా కలిసి వస్తుందట. ఊహించని ధన లాభం, ఆరోగ్య లాభం రెండూ కలిసి వస్తాయట. జీవితంలో ఉన్న ఆర్థిక, ఆరోగ్య సమస్యలు పోయి సంతోషంగా ఉంటారని చెప్పారు. ఈ రాశితోపాలు కర్కాటక రాశికి కూడా ఊహించని లక్ 2025లో కలిసి వస్తుందని బాబా చెప్తున్నారు. విపరీతంగా డబ్బు సంపాదించడంతో పాటు వాళ్ల జీవితాల్లో ఉన్న కలహాలు కూడా తొలగిపోతాయట. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా విపరీతంగా డబ్బు సంపాదిస్తారట ఈ రాశి వాళ్లు. ఇక మకర రాశి వాళ్లకు కూడా 2025 బాగా కలిసి వస్తుందని బాబా చెప్తున్నారు. ఆర్థికంగా స్థిరపడి చాలా కాలంగా ఉన్న కలహాలు తొలగిపోతాయని చెప్తున్నారు. జీవితంలో చాలా సంతోషం నిండిపోతుందని చెప్తున్నారు బాబా వంగా. 2025 లో రాశుల వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారని బాబా వంగా జోతిష్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన చెప్పిన జోతిష్యం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. చాలా సందర్భాల్లో ఆయన చెప్పింది చెప్పినట్టు జరగడంతో.. ఈ రాశుల వాళ్లు ఫుల్ ఖుషీలో వీడియోను షేర్ల మీద షేర్లు కొట్టేస్తున్నారు.