SS Rajamouli: నిర్మాత గా మారిన జక్కన్న.. ఊహించని ప్రయోగం

రాజమౌళి మరోసారి నిర్మాతగా మారాడు. అయితే ఆ సినిమాను ఆయన డైరెక్ట్‌ చేయడం లేదు. కమర్షియల్‌ మూవీస్‌ మాత్రమే డైరెక్ట్ చేసే జక్కన్న నిర్మాతగా ప్రయోగం చేస్తున్నాడెందుకు అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 10:39 AM IST

గ్లోబల్‌ డైరెక్టర్‌ రాజమౌళి ట్వీట్‌ ఆసక్తి రేపడంతోపాటు.. షాక్‌ ఇచ్చింది. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. రాజమౌళి సినిమాల మేకింగ్‌లో కీ రోల్‌ పోషించే ఆయన కొడుకు కార్తికేయ నిర్మాతగా మరో ప్రొడ్యూసర్‌ వరుణ్‌ గుప్తాతో కలిసి ఈ సినిమాను తీస్తున్నారు. ఇండియన్‌ సినిమా ఎక్కడ పుట్టింది? మూలం ఏంటన్న కథతో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ రూపొందుతోంది.
‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక భారతీయ సినిమాపై బయోపిక్‌. నితిన్‌ కుక్కర్‌ దర్శకుడు. దర్శకధీరుడు ట్వీట్‌ చేస్తూ.. సినిమాను ఎనౌన్స్‌ చేశాడు. ‘కథ విన్న వెంటనే ఎమోషన్‌కు గురయ్యానని.. బయోపిక్‌ తీయడం చాలా కష్టమని.. అలాంటి ఇండియన్‌ సినిమాపై బయోపిక్‌ తీయడం పెద్ద సవాలే అన్నారు జక్కన్న.

సవాళ్లకు చిత్ర యూనిట్ సిద్దంగా వుందని..ఇలాంటి సినిమాను ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నందుకు గర్వంగా వుందన్నారు. పాన్‌ ఇండియా మూవీగా రూపొందే ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఆరు భాషల్లో రిలీజ్‌ కానుంది.రాజమౌళి యమదొంగ సినిమాతో నిర్మాతగా మారాడు. విశ్వామిత్ర క్రియేషన్స్‌ బేనర్‌లో ఈ సోషియో ఫాంటసీ మూవీని తీశాడు. 2007 తర్వాత మరోసారి ప్రొడక్షన్ జోలికి వెళ్లని జక్కన్న మేడ్‌ ఇన్‌ ఇండియా మూవీతో ప్రజెంటర్‌గా వ్యవహరిస్తూ.. కొడుకును నిర్మాత చేశాడు.

రాజమౌళి ఆమధ్య కరణ్‌ జోహార్‌ కోసం.. ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి ప్రజెంటర్‌గా వ్యవహరించి తెలుగులో ప్రమోట్‌ చేశాడు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’కు రాజమౌళి ఫుల్‌ ఫ్లెడ్జ్‌ ప్రొడ్యూసర్‌ కాదు. వరుణ్‌ గుప్తా కలిసి నిర్మిస్తున్నారు. కథ నచ్చి మంచి సినిమాకు నిర్మాత అయ్యాడే తప్ప.. ఈ సినిమా కథ గురించి.. మేకింగ్‌ గురించి పెద్దగా ఆలోచించడు జక్కన్న. ఆ బాధ్యతను కొడుక్కి అప్పజెప్పేసి.. మహేశ్‌ మూవీ కథలో బిజీగా వుంటున్నాడు రాజమౌళి. నిర్మాతగా.. దర్శకుడిగా రెండు పడవులపై కాలు పెట్టడడం జక్కన్నకు ఇష్టం వుండదు. అందుకే యమదొంగ తర్వత ప్రొడక్షన్‌ జోలికి పోలేదు .