KCR Rajshyamala Yagam : ఎన్నికల ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం..

తాజాగా కేసీఆర్ ఎన్నిక ముందు ఒక యాగం చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్ర, ప్రజలు సంతోషంగా ఉండాలని... సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లో తన వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ యాగానికి తెలంగాణ, కర్ణాటక, నుంచి 200 మంది వైదికులు, ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ పట్నం శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగం జరుగుతున్నట్లు సమాచారం.

సీఎం కేసీఆర్ ఇప్పటికే 17 రోజులు 42 సభలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2018 ఎన్నికల కు ముందు ఇదే తరహాలో తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు కేంద్రికృతం చేస్తు భారీ బహిరంగ సభలు నిర్వహించి మళ్లి రెండో సారి అధికార పగ్గాలు చేపట్టారు సీఎం కేసీఆర్. ఇక ఈ సారి అందరి కంటే ముందుగా ఒకేసారి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి.. ప్రతిపక్షాల కంటే ముందుగానే ప్రతి రోజు మూడు సభల చొప్పున సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎవరిని ఎక్కడ తగ్గకుండా ప్రతిపక్షాలు మరింత దూకుడుగా మాటల తుటాలు విసురుతు.. ప్రథ్యర్థులకు చూరకలు చూపిస్తున్నారు సీఎం.

తాజాగా కేసీఆర్ ఎన్నిక ముందు ఒక యాగం చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్ర, ప్రజలు సంతోషంగా ఉండాలని… సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లో తన వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ యాగానికి తెలంగాణ, కర్ణాటక, నుంచి 200 మంది వైదికులు, ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ పట్నం శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగం జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ తరుణంలో నిన్నా రాత్రి సీఎం కేసీఆర్ దంపతులు ఎర్రవెల్లికి చేరుకున్నారు.

ఈ యాగాలు ఎందుకు చేస్తారు..?

పూర్వపు కాలంలో రాజులు ఇతర రాజ్యంపై దండయాత్రకు వెళ్లడానికి ముందు శత్రు సంహార యాగం, చండీ యాగాలు, రాజ శ్యామల యాగాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల యుద్ధం లో మేము గెలుస్తాము అని నమ్మిక.. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు ఎన్నికలు అనేది ఓ యుద్దం కదా.. గతంలో కూడా సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల ముందు రాజ శ్యామలా యాగం చేసి తర్వాత ఎన్నికలకు వెళ్లగా కేసీఆర్ ఘణ విజయ సాదించారు.